
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసకుంది కోటక్ బ్యాంక్. ఈ వడ్డీ రేట్లు రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయని పేర్కొంది. పెరిగిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 12 నుంచే అమలులోకి వచ్చాయి.
కొత్త వడ్డీ రేట్లు ఇలా..!
- 7 నుంచి 14 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2.50 శాతంగా ఉంచింది కోటక్ మహీంద్రా బ్యాంక్. సీనియర్ సిటిజన్లకు 3 శాతం.
- 15 నుంచి 30 రోజుల వ్యవది ఉన్న ఎఫ్‌డీలకు వడ్డీ రేటు 2.50 శాతం. సీనియర్ సిటిజన్లకు 3 శాతం.
- 31 రోజుల నుంచి 45 రోజుల మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 2.75 శాతంగా ఉంచింది బ్యాంకు. సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం.
- 46 నుంచి 90 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 2.75 శాతంగా నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం.
- 91 నుంచి 120 రోజుల కాల పరిమితి ఉన్న ఎఫ్డీలపై వడ్డీ రేటును 3 శాతంగా ఉంచింది కోటక్ బ్యాంక్. సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం.
- 121 నుంచి 180 రోజుల వ్యవధి ఉన్న ఎఫ్డీలపై వడ్డీ రేటును 3.50 శాతంగా నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు 4 శాతం.
- 181 నుంచి 270 రోజుల కాల పరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేటు.50 శాతం. సీనియర్ సిటిజన్లకు 5 శాతం.
- 271 నుంచి 363 రోజుల వ్యవధి ఉన్న ఎఫ్డీలపై వడ్డీ రేటు 4.50 శాతంగా నిర్ణయించింది బ్యాంక్. సీనియర్ సిటిజన్లకు 5 శాతం.
- 364 రోజుల ఎఫ్డీపై వడ్డీ రేటు 4.75 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం.
- 365 నుంచి 389 రోజుల ఎఫ్డీపై వడ్డీ రేటును 5.10 శాతంగా ఉంచింది కోటక్ బ్యాంక్. సీనియర్ సిటిజన్లకు 5.60 శాతం.
- 390 రోజుల ఎఫ్డీపై వడ్డీ రేటు 5.20 శాతంగా ఉండటం గమనార్హం. సీనియర్ సిటిజన్లకు 5.70 శాతం.
- 391 రోజుల నుంచి నుంచి 23 నెలలలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 5.25 శాతం. సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం.
- 23 నెలల 1 రోజు నుంచి రెండేళ్ల లోపు ఎఫ్డీకి వడ్డీ రేటు 5.25 శాతం. సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం.
- రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఎఫ్డీకి వడ్డీ రేటు 5.30 శాతం. సీనియర్ సిటిజన్లకు 5.80 శాతం.
- మూడు నుంచి 4 ఏళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.45 శాతం. సీనియర్ సిటిజన్లకు 5.95 శాతం.
- నాలుగేళ్లు నుంచి 5 సంవత్సరాల లోపు ఎఫ్డీలపై 5.50 శాతం వడ్డీ ఇస్తోంది కోటక్ బ్యాంక్. సీనియర్ సిటిజన్లకు 6 శాతం. ఐదేళ్ల కన్నా ఎక్కువ.. పదేళ్ల వరకు ఎఫ్డీలు చేస్తే గరిష్ఠంగా 5.60 శాతం వడ్డీ చెల్లించనుంది కోటక్ బ్యాంక్. ఇదే కాలపరిమితితో సీనియర్ సిటిజన్లకు అయితే 6.10 శాతంగా వడ్డీ నిర్ణయించింది బ్యాంకు.