కుప్పకూలిన ఐ‌ఆర్‌సిటిసి షేర్లు..ఆగస్ట్‌ 12 వరకూ రైళ్లు రద్దు...

Ashok Kumar   | Asianet News
Published : Jun 26, 2020, 03:07 PM ISTUpdated : Jun 27, 2020, 12:15 AM IST
కుప్పకూలిన ఐ‌ఆర్‌సిటిసి షేర్లు..ఆగస్ట్‌ 12 వరకూ రైళ్లు  రద్దు...

సారాంశం

రైల్వే బోర్డు గురువారం ఒక నోటిఫికేషన్‌లో జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకు బుక్ చేసిన అన్నీ రెగ్యులర్ రైళ్లకు టికెట్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మార్చి 2020 తో ముగిసిన త్రైమాసికంలో ఐఆర్‌సిటిసి తన నాలుగవ త్రైమాసిక ఫలితాలను ఈ రోజు ప్రకటించనుంది.

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో భారత రైల్వే రెగ్యులర్ రైళ్లను ఆగస్టు 12 వరకు  రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశపు టాప్ ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐ‌ఆర్‌సిటిసి) స్టాక్స్ కుప్పకూలిపోయాయి.

జూన్ 26న ఎన్‌ఎస్‌ఈ ప్రారంభంలో ఈ షేరు 5% పైగా పడిపోయాయి. రూ. 1340 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 3 శాతం నష్టంతో రూ. 1372 వద్ద ట్రేడవుతోంది. రూ. 134 కోట్ల స్థాయిలో నికర లాభం నమోదుకావచ్చని పేర్కొంది. ఆదాయం 17 శాతం తక్కువగా రూ. 594 కోట్లకు చేరవచ్చని అభిప్రాయపడింది.

రైల్వే బోర్డు గురువారం ఒక నోటిఫికేషన్‌లో జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకు బుక్ చేసిన రెగ్యులర్ రైళ్లకు టికెట్లు రద్దు చేస్తూ వాటికి రిఫండ్ ఇవ్వనున్నట్లు వివరించింది.  "మే 12 ఇంకా జూన్ 1 నుండి ప్రారంభించిన అన్ని ప్రత్యేక రైళ్లు, వలస కూలీల కోసం 200 శ్రామిక్ స్పెషల్‌, రాజధాని, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తూనే ఉంటాయి." అని తెలిపింది.

also read షాక్ మీద షాకిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు...వరుసగా మళ్ళీ పెంపు.. ...

మార్చి 2020 తో ముగిసిన త్రైమాసికంలో ఐఆర్‌సిటిసి తన నాలుగవ త్రైమాసిక ఫలితాలను ఈ రోజు ప్రకటించనుంది. మార్చి 2020తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయాలపై విశ్లేషకులకు పెద్దగా ఆశలు లేనట్లు వ్యక్తమవుతుంది.

లాక్ డౌన్ ముందు ఐ‌ఆర్‌సిటిసి ద్వారా విక్రయించే టికెట్ల సంఖ్య మార్చి ప్రారంభంలో రోజుకు 5.5 లక్షల టిక్కెట్లకు తగ్గింది. ఈ రోజు స్టాక్ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ ఇచ్చిన నివేదిక ప్రకారం.

లాక్ డౌన్ పొడిగింపు, ట్రైన్ టికెట్ల రద్దు కారణంగా ఐఆర్‌సిటిసి ఈ ఏడాది ఆదాయంలో 5.1% నుండి 23% మధ్య దెబ్బతింటుందని పరిశోధనా సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ ఆశిస్తున్నారు. "లాక్ డౌన్ ముందు నుంచి ఏప్రిల్ 14 వరకు బుక్ చేసిన టికెట్లు, మేము రద్దు చేసిన రైళ్ళకు మాత్రమే రీఫండ్ ప్రారంభించాము" అని రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

NPS Scheme: ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి.? ఏ డాక్యుమెంట్స్ కావాలి
Year End Sale : ఐఫోన్, మ్యాక్‌బుక్‌లపై భారీ డిస్కౌంట్లు.. విజయ్ సేల్స్ బంపర్ ఆఫర్లు!