Indian Overseas Bank: ఆ బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గింపు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Apr 11, 2022, 02:58 PM IST
Indian Overseas Bank: ఆ బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గింపు..!

సారాంశం

వడ్డీ ధరల విషయంలో బ్యాంకులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వడ్డీ ధరలను సవరిస్తూ ఉంటాయి. కొన్ని బ్యాంకులు వడ్డీ ధరలు పెంచితే.. మరికొన్ని బ్యాంకులు తగ్గిస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.   

ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు(ఐఓబీ) తన కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్ చెప్పింది. షార్ట్ టర్మ్ డిపాజిట్లపై(ఏడాది కంటే తక్కువ వ్యవధి కలిగి రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై) వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తగ్గించిన వడ్డీ రేట్లు సోమవారం (ఏప్రిల్ 11, 2022) నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

7 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకు రేపటి నుంచి 3 శాతం వడ్డీ రేటునే ఆఫర్ చేయనుంది. ఈ వడ్డీ రేటు ప్రస్తుతం 3.4 శాతంగా ఉంది. అలాగే 30 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటు 3 శాతంగా నిర్ణయించింది. 121 రోజుల నుంచి 179 రోజులలో మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై బ్యాంకు 4 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయనుంది. 270 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.5 శాతంగా ఉంది.

కొత్త‌ వడ్డీ రేట్లు..!

- 7 రోజుల నుంచి 14 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటు

- 15 రోజుల నుంచి 29 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటు

- 30 రోజుల నుంచి 45 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటు

- 46 రోజుల నుంచి 60 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ రేటు

- 61 రోజుల నుంచి 90 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ రేటు

- 91 రోజుల నుంచి 120 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు

- 121 రోజుల నుంచి 179 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు

- 180 రోజుల నుంచి 269 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటు

- 270 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధి గల డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటు

- ఏడాది నుంచి రెండేళ్ల లోపున్న డిపాజిట్లపై 5.15 శాతం

- రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు వ్యవధి కల డిపాజిట్లపై 5.20 శాతం వడ్డీ

- మూడేళ్లు, ఆపైబడిన డిపాజిట్లపై 5.45 శాతం వడ్డీ రేటు

ఖాతాదారు సీనియర్ సిటిజన్ అయితే పైన పేర్కొన్న వడ్డీ రేట్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ లభించనుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు, ఆపైబడిన వారికి) అదనంగా 0.75 శాతం వడ్డీని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు ఆఫర్ చేస్తుంది. ఐఓబీ పన్ను ఆదా డిపాజిట్లపై వడ్డీ రేటు 5.45 శాతంగానే కొనసాగనుంది.

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !