
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానం ఇప్పటికీ ప్రకాశవంతంగా ఉందని, 2023లో ప్రపంచ వృద్ధిలో 15 శాతం వరకూ భారత్ కాంట్రిబ్యూషన్ ఉందని అన్నారు. డిజిటలైజేషన్ ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ మహమ్మారి సంక్షోభం నుంచి బయటకు వచ్చిందని ఆమె ఈ సందర్భంగా అన్నారు. ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవం కోసం ప్రభుత్వం తన ప్రయత్నాలను ప్రతిపాదించడం, సమర్థవంతమైన ఆర్థిక విధానం, బడ్జెట్ కేటాయింపులు పెట్టుబడి, ఫైనాన్సింగ్‌తో పాటు వృద్ధి వేగాన్ని కొనసాగించడంలో సహాయపడటానికి ముఖ్యమైనవిగా ఉన్నాయి.
ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో వేగవంతమైన వృద్ధి రేట్లు
ఐఎంఎఫ్ క్రిస్టాలినా జార్జివా చీఫ్ మాట్లాడుతూ 'భారత పనితీరు అద్భుతం. మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 6.8 శాతం వృద్ధి రేటును కొనసాగించగలదని భావిస్తున్నామన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు), మేము 6.1 శాతం అంచనా వేస్తున్నామని ఆమె తెలిపారు.
ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థల మాదిరిగానే భారతదేశ వృద్ధి కూడా కొంచెం మందగించింది, అయితే ఇది ఇప్పటికీ ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉందని జార్జివా పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2023లో ప్రపంచ వృద్ధిలో దాదాపు 15 శాతాన్ని భారత్ అందించగలదని అంచనా వేస్తున్నామని, ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఇది వేగవంతమైన వృద్ధి రేటు అని తెలిపారు.
ప్రపంచ వృద్ధి గత ఏడాది 3.4 శాతం నుంచి 2023 నాటికి 2.9 శాతానికి తగ్గింది. మహమ్మారి , దుష్ప్రభావాలను అధిగమించడానికి , వృద్ధి , ఉద్యోగాలకు అవకాశాలను సృష్టించడానికి భారతదేశం డిజిటలైజేషన్‌ను విజయవంతంగా అమలు చేసిందన్నారు.
IMF చీఫ్ ఈ సందర్భంగా మరిన్ని విషయాలు మాట్లాడుతూ 'భారత ఆర్థిక విధానం ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉంది. మేము సమర్పించిన కొత్త బడ్జెట్‌ను చూశాము , ఇది ఆర్థిక ఏకీకరణకు నిబద్ధతను చూపుతుంది, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన తాజా వార్షిక బడ్జెట్ అటు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అమలు చేసేలా బాలెన్స్ చేసిందని గుర్తు చేశారు. అలాగే గ్రీన్ ఎకానమీ భారతదేశ స్థితిని మారుస్తుందని IMF చీఫ్ అభిప్రాయపడ్డారు. దేశం స్వచ్ఛమైన ఇంధనం వైపు పయనించడానికి సహాయపడుతుందన్నారు.
డిజిటల్ రంగంలో భారత్ ఒక విప్లవం
జార్జివా ప్రకారం, భారతదేశంలో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడానికి COVID ట్రిగ్గర్‌గా పనిచేసిందని. దీని తర్వాత చాలా స్టార్టప్‌లు కూడా ప్రారంభమయ్యాయని. భారతదేశ ప్రత్యేకత ఏమిటంటే పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా డైనమిక్ పద్ధతిలో నిర్మించారని, ఈ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుండి ప్రైవేట్ రంగం ప్రయోజనం పొందడం సులభం అయ్యిందన్నారు. భారత్ ఆదాయ సేకరణలో గొప్ప పురోగతి సాధించిందని, తమ పన్ను వ్యవస్థపై సమర్థవంతంగా పని చేసిందని, ఇందుకు GST సక్సెస్ అవడం ఒక ఉదాహరణ అన్నారు.