జస్ట్ 5 రోజుల్లో రూ. 1 లక్షపై రూ. 90 వేల లాభం అందించిన స్టాక్స్ ఇవే..ఓ లుక్కేయండి..అంటే డబుల్ ప్రాఫిట్ సొంతం..

By Krishna Adithya  |  First Published Jun 12, 2023, 12:50 AM IST

స్టాక్ మార్కెట్లో చాలా తక్కువ కాలంలోనే డబ్బు సంపాదించవచ్చు. మీరు కూడా స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలి, అనుకుంటే ఎంపిక చేసిన స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఒక్కోసారి మీరు కొనుగోలు చేసిన స్టాక్స్ చాలా తక్కువ సమయంలోనే అత్యధిక రిటర్న్ అందిస్తుంటాయి. అటువంటి ఓ ఐదు స్టాక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ స్టాక్స్ గత వారం కేవలం ఐదు రోజుల్లోనే 90 శాతం వరకు రిటర్న్ అందించాయి.


భారత స్టాక్ మార్కెట్లో గడచిన వారం రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఆల్ టైం రికార్డుల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.  గత వారం స్టాక్ మార్కెట్లో గమనించినట్లయితే 18,700 దాటిన తర్వాత, నిఫ్టీ 50 సాఫ్ట్‌గా మారి జూన్ 9తో ముగిసిన వారానికి 0.16 శాతం పెరిగి 18,563 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.13 శాతం పెరిగి 62,625 వద్ద ముగిసింది. సెక్టార్ పరంగా చూస్తే ఇన్‌ఫ్రా ‘ 1.8 శాతం, ఆటో 1.7 శాతం పెరిగాయి. ఐటీ 3.4 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.2 శాతం క్షీణించాయి. 

అయితే కొన్ని స్టాక్స్ లలో స్పెసిఫిక్ రియాక్షన్ కనిపించింది. ఈ స్టాక్స్ ఏకంగా గడిచిన 5 రోజుల్లో దాదాపు 85% వరకు లాభపడ్డాయి అలాంటి స్టాక్స్ 5 వరకూ ఉన్నాయి.  ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో లాభపడే స్టాక్స్ లో ఐదు మాత్రం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి అవేంటో ఓ లుక్కేద్దాం. 

Latest Videos

Jaipan Industries

జైపాన్ ఇండస్ట్రీస్ స్టాక్ గత వారంలో కేవలం 5 ట్రేడింగ్ రోజుల్లోనే 87.91 శాతం రాబడిని ఇచ్చింది. ఈ కంపెనీ స్టాక్ రూ.28.79 నుంచి రూ.54.10కి చేరింది. శుక్రవారం కూడా ఈ షేరు 10 శాతం లాభంతో ముగిసింది.

Orosil Smiths India

ఒరోసిల్ స్మిత్స్ ఇండియా స్టాక్ 5 రోజుల్లో 58.68 శాతం రాబడిని ఇచ్చింది. ఈ కంపెనీ స్టాక్ రూ.3.80 నుంచి రూ.6.03కి చేరింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.24.91 కోట్లు.

KIFS Financial

KIFS ఫైనాన్షియల్ స్టాక్ గత వారంలో కేవలం 5 ట్రేడింగ్ రోజుల్లో 57.31 శాతం రాబడిని ఇచ్చింది. ఈ కంపెనీ స్టాక్ రూ.95 నుంచి రూ.149.44కి పెరిగింది. దీని స్టాక్ శుక్రవారం 10 శాతం లాభంతో ముగిసింది.

Maan Aluminium

మాన్ అల్యూమినియం స్టాక్ గత వారం 5 ట్రేడింగ్ రోజుల్లో 55.50 శాతం రాబడిని ఇచ్చింది. ఈ కంపెనీ స్టాక్ రూ.207.65 నుంచి రూ.322.90కి చేరింది. శుక్రవారం 1.60 శాతం బలంతో ముగిసింది.

Hipolin Ltd

హిపోలిన్ లిమిటెడ్ స్టాక్ 5 రోజుల్లో 47.07 శాతం రాబడిని ఇచ్చింది. ఈ కంపెనీ స్టాక్ రూ.75 నుంచి రూ.110.30కి పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.34.74 కోట్లు.

click me!