సత్తా చాటిన ఐఐటీ మద్రాస్ స్టూడెంట్స్, క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో 25 మందికి రూ.1 కోటి ప్యాకేజీ..

By Krishna Adithya  |  First Published Dec 4, 2022, 6:55 PM IST

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ సంస్థలు రిక్రూట్మెంట్ విషయంలో కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఐఐటీ మద్రాసులో జరిగిన రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 25 మంది విద్యార్థులు ఒక కోటి కన్నా ఎక్కువ ప్యాకేజీలకు సెలక్ట్ అయ్యారు.


ఐఐటి క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే చాలామందికి ఆసక్తి.  కేవలం 20 సంవత్సరాల వయస్సు ఉన్న ఫ్రెష్  గ్రాడ్యుయేట్ లను భారీ  ప్యాకేజీలు ఇచ్చి పలు కార్పొరేట్ కంపెనీలు ఎగరేసుకుపోవడం సహజం.  బయట ఫ్రెషర్స్ కు కనీసం ఉద్యోగం దక్కడమే గగనంగా ఉన్న ఈ రోజుల్లో ఐఐటి మద్రాస్ లో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఏకంగా 25 మంది స్టూడెంట్స్ సంవత్సరానికి ఒక కోటి రూపాయల ప్యాకేజీని పొంది దేశంలోనే సంచలనంగా నిలిచారు.  దీన్ని బట్టి దేశంలో ఐఐటీ standards ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై (IIT-మద్రాస్) 2022-23 విద్యా సంవత్సరానికి రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. ఈ ఏడాది మొత్తం 25 మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ లో భాగంగా రూ. 1 కోటి కంటే ఎక్కువ ప్యాకేజీకి సెలెక్ట్ అయ్యారు. మొదటి రోజు సెషన్ మొత్తం 445 మంది విద్యార్థులకు రిక్రూట్ చేసుకున్నారు. IIT చెన్నై ఈ సంవత్సరం అత్యధిక ప్లేస్‌మెంట్ ఆఫర్‌లను నమోదు చేసింది, గత సంవత్సరం సంఖ్య 407 కంటే దాదాపు 10 శాతం ఎక్కువ.

Latest Videos

undefined

ఈ సంవత్సరం, IIT-మద్రాస్ విద్యార్థులకు అత్యధిక ఆఫర్‌లను అందించిన  కంపెనీలు ఇవే: టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ (14 ఆఫర్‌లు), బజాజ్ ఆటో లిమిటెడ్ (10 ఆఫర్‌లు), క్వాల్‌కామ్ (8 ఆఫర్‌లు), JP మోర్గాన్ చేస్ & కో (9 ఆఫర్‌లు), ప్రోక్టర్ & గాంబుల్ (7 ఆఫర్‌లు) ), మోర్గాన్ స్టాన్లీ (6 ఆఫర్‌లు), గ్రావిటన్ (6 ఆఫర్‌లు), మెకిన్సే & కంపెనీ (5 ఆఫర్‌లు), కోహెసిటీ (5 ఆఫర్‌లు)

.
మరోవైపు IIT గౌహతి తన ప్లేస్‌మెంట్ క్యాంపును ప్రారంభించింది, ఇందులో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్, డేటా సైన్స్, క్వాంట్, కోర్ ఇంజనీర్, UX డిజైనర్, VLSI, ఆటోమోటివ్ ఇంజనీరింగ్, అనలిస్ట్, ప్రొడక్ట్ డిజైనర్, కొన్ని ఇతర రంగాలు ఉన్నాయి. మొత్తం 168 రంగాలకు చెందిన 46 కంపెనీలు ఆఫర్లు ఇచ్చాయి. 

IIT గౌహతిలో ప్లేస్‌మెంట్‌లను అందించిన కొన్ని అగ్రశ్రేణి కంపెనీల్లో Microsoft, Texas Instruments, Google, Uber, Qualcomm, C-dot, Enphase Energy, Oracle, Nutanix, ThoughtSpot MTS-2, Squarepoint SDE/Quant, American Express, JP మోర్గాన్ చేజ్, బజాజ్, రిప్లింగ్, టిబ్రా, కోహెసిటీ,స్ప్రింక్లర్ ప్లాట్‌ఫారమ్ వంటి కంపెనీలు మొదలైనవి ఉన్నాయి. 

ఇదిలా ఉంటే దేశంలో ఐఐటిలతో పాటు ఐఐఎం లాంటి సంస్థలు సైతం పట్టభద్రులైన విద్యార్థులకు భారీ ఎత్తున ప్యాకేజీలు అందించేందుకు కార్పొరేట్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. 
 

click me!