మహిళలు మీరు ప్రతి నెల డబ్బు దాచి పెడుతున్నారా..అయితే మీరు దాచిపెట్టిన డబ్బులు ఒక క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే, 50 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా భారతీయ మహిళలు తమ దగ్గర ఉన్న డబ్బును వంట ఇంట్లోని పోపులో పెట్టలో దాచుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చాలామంది మహిళలు వంట ఇంట్లోని బియ్యం, పప్పులు, దాచుకునే డబ్బాల్లో కూడా డబ్బులు దాచి పెడుతూ ఉంటారు. ఇంట్లో ఖర్చులు చేయగా మిగిలిన డబ్బును అలా దాచిపెట్టడం మనం చూస్తూ ఉంటాము. ఆ డబ్బులతో వారు భవిష్యత్తులో తమ పిల్లలకు బంగారం, లేదా ఇతర ఖర్చులకోసం ఇస్తూ ఉంటారు. సాధారణంగా భారతీయ మహిళలకు పొదుపు చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. తమ ఆడంబరాలను సైతం తమ ఇష్టాలను సైతం త్యాగం చేసి పిల్లల కోసం భవిష్యత్తు కోసం డబ్బులు దాచి పెడుతూ ఉంటారు.
అయితే ఇలా పోపుల పెట్టలోను, స్టీలు డబ్బాల్లోనూ డబ్బులు దాచుకునే బదులు సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే పెద్ద మొత్తంలో డబ్బును, పొందే వీలుంది. డిమానిటైజేషన్ సమయంలో చాలామంది మహిళలు పాత నోట్లను వంటింట్లో దాచుకొని వాటిని ఎలా మార్చాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. కొంతమంది స్త్రీలు పాత నోట్లను మార్చుకోలేక నష్టపోయారు.
మీరు కూడా ఇలాంటి పద్ధతుల్లో డబ్బులు దాచుకున్నట్లయితే, తప్పు చేస్తున్నట్లే. అందుకే సరైన పద్ధతిలో మీ డబ్బును ప్రతినెల ఇన్వెస్ట్ చేసినట్లయితే పెద్దవి మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు ప్రతి నెల 5000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 20 సంవత్సరాల కాలంలో సుమారు 50 లక్షల రూపాయలు మీ సొంతం అయ్యే అవకాశం ఉంది. ఇది ఎలాగో పూర్తి లెక్కలతో సహా మనం తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా, భారీ మొత్తంలో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ప్రతినెల నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసినట్లయితే, మీరు మంచి మొత్తంలో డబ్బు పొందే అవకాశం ఉంది.
అయితే మహిళలు ప్రతినెల 5000 రూపాయలు ఎంపిక చేసిన మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ ప్రాతిపదికన 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే 50 లక్షల రూపాయలను పొందే వీలుంది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ విషయంలో అయితే రూ. 5000 అనేది చాలా తక్కువ మొత్తం అనే చెప్పవచ్చు ఒకవేళ మీ ఇంటి ఖర్చులు పోను రూ.1000 మిగిలినప్పటికీ సిప్ ప్రాతిపదికన ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఇప్పుడు 50 లక్షలు ఎలా పొందవచ్చు తెలుసుకుందాం:
నెలకు 5000 చొప్పున 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే మీరు 49,95,740 రూపాయలు పొందవచ్చు. ఇందులో అసలు 12,00,000 రూపాయలు కాగా, మీ పెట్టుబడిపై రాబడి 37,95,740 రూపాయలుగా ఉండే అవకాశం ఉంది. రెండు కలిపిస్తే సుమారు రూ. 49,95,740 ఉండే అవకాశం ఉంది. అయితే సాలీనా 12 శాతం వృద్ధి సాధించినప్పుడు మీకు ఇంత మొత్తం లో డబ్బు వచ్చే అవకాశం ఉంది.
గమనిక : మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. స్టాక్ మార్కెట్ లాభనష్టాలకు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ప్రభావితం అవుతుంటాయి. కావున మీరు పెట్టుబడి పెట్టేముందు నిబంధనలు పూర్తిగా తెలుసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం ఉత్తమం. మీ పెట్టుబడులకు లాభనష్టాలకు ఏషియా నెట్ న్యూస్ ఎలాంటి బాధ్యత వహించదు.