ICICI Bank కఠిన నిర్ణయం.. ఇకపై మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసా?

Published : Aug 09, 2025, 01:42 PM IST
ICICI bank

సారాంశం

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంకు తన కొత్త ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఇకపై నెలవారీ మినిమం బ్యాలెన్స్‌ మెట్రో, అర్బన్‌లో రూ.50,000కి పెంచింది. ఇతర ప్రాంతాల ఖాతాదారుల కోసం కూడా బ్యాలెన్స్ పెరిగింది. ఈ నియమాన్ని ఉల్లఘిస్తే భారీ జరిమానాలు తప్పవంట.

ICICI Bank: దేశంలోని రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుండి తన కొత్త ఖాతాదారుల మినిమం బ్యాలెన్స్ నిబంధనలో మార్పు చేసింది. ఈ చర్య ద్వారా ప్రీమియం ఖాతాదారుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇకపై మెట్రో, అర్బన్ ప్రాంతాలలో ఆగస్టు 1 తర్వాత సేవింగ్స్ అకౌంట్ తెరిచిన ఖాతాదారులు నెలకు కనీసం రూ.50,000 సగటు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని తెలిపింది. ఇది ఇప్పటి వరకు రూ.10,000 ఉండేది, అయితే పాత ఖాతాదారుల కోసం ఈ బ్యాలెన్స్ స్థాయి ఇప్పటికీ యథావిధిగా కొనసాగుతుంది.

అంతే కాకుండా Semi-urban ప్రాంతాల్లో కొత్త ఖాతాదారులకు రూ.25,000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. గ్రామీణ ప్రాంత ఖాతాదారులు రూ.10,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. పాత ఖాతాదారులకు ఈ మినిమం బ్యాలెన్స్ రూ.5,000 ఉంటే సరిపోతుంది. మినిమం బ్యాలెన్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఖాతాదారులకు భారీ మొత్తంలో జరిమానా విధించబడుతుంది. తగిన బ్యాలెన్స్ లేకపోతే.. తక్కువ ఉన్న బ్యాలెన్స్ పై 6% లేదా రూ.500 వసూలు చేసే అవకాశముంది.

ఇకపై ఈ పెరుగుదల దేశంలోని పెద్ద ప్రైవేట్ బ్యాంకుల నుండి వచ్చిన ముఖ్య నిర్ణయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, భారతదేశపు అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులపై మినిమం ఖాతా చార్జీలు తొలగించిన విషయం ప్రత్యేకం. అలాగే.. ఇటీవల బ్యాంకులు తమ నిబంధనల్లో మార్పులు చేసుకుంటూ, ఖాతాదారులకు అనుకూలంగా ఉండేలా పని సమయంలో ICICI బ్యాంక్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Credit Card: లైఫ్ టైమ్ నో ఫీ, క్యాష్‌బ్యాక్‌లు.. ఇన్ని ఇచ్చినా క్రెడిట్ కార్డుల‌తో బ్యాంకులు ఏంటీ లాభం.?
Post Office: నెల‌కు రూ. 12500 పొదుపు చేస్తే.. రూ. 40 ల‌క్ష‌లు మీ సొంతం