ITR రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి; జస్ట్ ఈ స్టెప్స్ పాటిస్తే చాలు..

By Ashok kumar Sandra  |  First Published Mar 23, 2024, 5:32 PM IST

ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రసీదు నంబర్ (acknowledgment number) ఉపయోగించి ఆన్‌లైన్‌లో ITR రిటర్న్  స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
 


ఒక పన్ను చెల్లింపుదారుడు  అసలు కంటే ఎక్కువ పన్ను చెల్లించినట్లయితే వారు ఆదాయపు పన్ను రిటర్న్ కు  అర్హులు. ఆదాయపు పన్ను రిటర్న్‌లో రీఫండ్ క్లెయిమ్ చేసిన తర్వాత, ఒక వ్యక్తి ITR రీఫండ్ స్టేటస్  చెక్ చేయవచ్చు. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ కావడం  ద్వారా ఒక వ్యక్తి  ITR రీఫండ్ స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో acknowledgment number ఉపయోగించి ఆన్‌లైన్‌లో ITR రిటర్న్ స్టేటస్  ఎలా చెక్  చేయాలో తెలుసుకోండి. 

ITR రీఫండ్ స్థితిని తెలుసుకోవడానికి ఇవి  స్టెప్స్ ; 

Latest Videos

undefined

1] మొదట ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ లింక్‌కి లాగిన్ కావాలి – https://eportal.incometax.gov.in/iec/foservices/#/login;

2] యూజర్  ID అండ్  పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి

3] 'మై అకౌంట్'కి వెళ్లి, 'రిటర్న్/డిమాండ్ స్టేటస్' పై క్లిక్ చేయండి;

4] డ్రాప్ డౌన్ మెనుకి వెళ్లి, 'ఆదాయ పన్ను రిటర్న్స్' సెలెక్ట్ చేసుకొని , 'సబ్మిట్' అప్షన్ పై క్లిక్ చేయండి. 

5] మీకు ఇచ్చిన నంబర్‌పై క్లిక్ చేయండి. 

6]  రీఫండ్ ఇష్యూ తేదీతో సహా మీ అన్ని ITR వివరాలను చూపే కొత్త వెబ్‌పేజీని చూపిస్తుంది.

ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారుడు   పాన్ కార్డ్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో ITR రీఫండ్ స్టేటస్ కూడా చెక్ చేయవచ్చు. ఇందుకోసం ఎన్‌ఎస్‌టీఎల్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. 

click me!