ఫ్యూచర్‌ రిటైల్‌లోని హెరిటేజ్‌ ఫుడ్స్‌ వాటా విక్రయం.. 3.65 శాతనికి రూ.132 కోట్లు..

By S Ashok KumarFirst Published Dec 10, 2020, 12:11 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, అతని కుటుంబ యాజమాన్యంలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ  ఉంది.
 

హెరిటేజ్ ఫుడ్స్ బుధవారం ఫ్యూచర్ రిటైల్లోని 3 శాతం వాటాను విక్రయించింది. హోల్డింగ్ మొత్తాన్ని రూ.132 కోట్లకు ఓపెన్ మార్కెట్లో విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. సెప్టెంబరు నెలలో హెరిటేజ్ సంస్థ ఒక బోర్డు సమావేశాన్ని నిర్వహించింది, ఇందులో ఫ్యూచర్ రిటైల్లో ఉన్న హెరిటేజ్ మొత్తం వాటాను విక్రయించాలని నిర్ణయించింది.

ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్‌లో ఉన్న 1,78,47,420 ఈక్విటీ షేర్ల మొత్తం హోల్డింగ్స్ / పెట్టుబడులను కంపెనీ తొలగించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, అతని కుటుంబ యాజమాన్యంలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ  ఉంది.

2016లో కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ ఈక్విటీ లావాదేవీ ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ రిటైల్, అనుబంధ వ్యాపారాలను ఏకీకృతం చేయడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి అనుగుణంగా అప్పటి విలువ ప్రకారం రూ.295 కోట్ల విలువైన 3.65 శాతం కొత్త షేర్లను హెరిటేజ్‌ ఫుడ్స్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌ జారీ చేసింది. 

also read 

హెరిటేజ్ ఫుడ్స్ రిటైల్ వ్యాపారంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని మూడు ముఖ్య దక్షిణ నగరాల్లో 124 హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్స్ చైన్ కలిగి ఉంది. హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్స్ లో గృహోపకరణాల వస్తువులు, వినియోగ వస్తువులు (ఎఫ్‌ఎంసిజి), స్టేపుల్స్, తాజా పండ్లు, కూరగాయలను విక్రయిస్తాయి.

ఫ్యూచర్ రిటైల్ రిలయన్స్ రిటైల్ తో ఒప్పందం కుదుర్చుకుంటున్న సమయంలో, హెరిటేజ్ ఫుడ్స్ తన వాటాను విక్రయించింది.

"ఈ వాటాలను ఓపెన్ మార్కెట్లో స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా వివిధ మార్గాల్లో విక్రయించారు, దీని నికర మొత్తం రూ.131.94 కోట్లను కంపెనీ అందుకుంది" అని హెరిటేజ్ సంస్థ తెలిపింది. హెరిటేజ్ ఫుడ్స్ దీర్ఘకాల కాలపరిమితి రుణాలను తిరిగి చెల్లించడానికి వీటిని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.

click me!