
మస్క్ తొలి గురి నకిలీ అకౌంట్స్ తొలగింపు పైనే ఉంటుందని అంతా భావిస్తున్నారు. గతంలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో నకిలీ అకౌంట్ ల కు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే మస్క్ తన తొలి టాస్క్ కింద నకిలీ అకౌంట్స్ తొలగింపు పైనే ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే నకిలీ ఎకౌంట్స్ లేదా ఫేక్ బాట్స్ తొలగించడం వల్ల ఒకరకంగా ట్విట్టర్ కు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.
ట్రంప్ లాంటి వారి అకౌంట్స్ రిస్టోర్ అవుతాయి..
అన్నిటికన్నా ముఖ్యంగా గతంలో ట్విట్టర్ మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ ను బ్లాక్ చేసింది. అంతేకాదు ఆయన అకౌంట్ ను పర్మినెంట్ గా టెర్మినేట్ చేసింది. మనదేశంలోనూ కంగనా రనౌత్, అలాగే మరికొంతమంది అకౌంట్ను ట్విట్టర్ బ్లాక్ చేసింది. దీనిపై ట్విట్టర్ యాజమాన్యం విమర్శలను ఎదుర్కొంది. ప్రస్తుతం మస్క్ యాజమాన్యంలో ట్విట్టర్ వైఖరి మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ లాంటి వారి అకౌంట్స్ పునరుద్ధరించే అవకాశం ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
ట్విట్టర్ పాత ఉద్యోగుల తొలగింపు..
ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ కూడా ట్విట్టర్ ఉద్యోగులను తొలగించాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రక్రియలో కంపెనీ నుంచి తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని ఆయన యాజమాన్యాన్ని కోరారు. దీనితో పాటు, మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ విధానాలలో కూడా మార్పులు చేయాలని ఆయన కోరారు.
ఎలాన్ మస్క్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మైక్రో బ్లాగింగ్ సైట్ CFO, CEO, పాలసీ చీఫ్ లకు ఇంటి మార్గం చూపించారు. ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, ఫైనాన్స్ చీఫ్ నెడ్ సెగల్ కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.
మస్క్ ట్విట్టర్ కోసం కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్‌ను రూపొందించినట్లు ప్రకటించారు. కౌన్సిల్ సమావేశానికి ముందు కంటెంట్‌కు సంబంధించిన లేదా నిషేధిత ఖాతాల పునరుద్ధరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. ఈ కౌన్సిల్ సమీక్ష తర్వాతనే మూతపడిన ఖాతాలను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు.
ట్విట్టర్‌లో 238 మిలియన్ల రోజువారీ వినియోగదారులు ఉన్నారు
ట్విట్టర్ 238 మిలియన్ల రోజువారీ వినియోగదారులను కలిగి ఉంది. ట్విట్టర్ చాలా కంపెనీలు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు ఇతర ప్రజా ప్రముఖులకు ఇష్టమైన వేదిక. ప్రత్యర్థి దృక్కోణాలను ఆరోగ్యకరమైన రీతిలో చర్చించే వేదికగా ట్విట్టర్ ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రకటనదారులకు రాసిన లేఖలో మస్క్ తెలిపారు.
ఇదిలా ఉంటే ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతిలోకి వెళితే పిచ్చోడి చేతిలో రాయి అవుతుందని చాలామంది టెక్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వెనుక కారణం లేకపోలేదు. అందుకు ఎలాన్ మస్క్ వ్యవహార శైలే కారణం. ఆయన గతంలో తన కంపెనీ దివాలా తీసిందని ట్వీట్ చేశాడు. దీంతో ఆయన కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇటువంటి విపరీత మనస్తత్వం ఎలాన్ మస్క్ సొంతం. అంతేకాదు ఎలాన్ మస్క్ గతంలో పలుమార్లు ఫేక్ ట్వీట్లు చేశారు. దీంతో టెస్లా సంస్థ చాలా నష్టపోయింది. అంతేకాదు ఎలాన్ మస్క్ తీసుకునే నిర్ణయాలు చర్యలు ఊహాతీతంగా ఉంటాయని, దీంతో ట్విట్టర్ ఇమేజ్ చాలా నష్టపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.