రూ.60వేలకి చేరువలో బంగారం.. రానున్న రోజుల్లో అల్ టైం హై రికార్డు సెట్ చేయనున్న పసిడి, వెండి ధరలు..

By asianet news teluguFirst Published Feb 3, 2023, 10:21 AM IST
Highlights

గత 24 గంటల్లో 24 క్యారెట్/ 22 క్యారెట్ బంగారం ధర రూ.650 పెరిగింది. ఫిబ్రవరి 3 శుక్రవారం నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 58,470 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53,600.
 

రోజురోజుకు మారుతున్న బంగారం, వెండి ధరలు కేంద్ర బడ్జెట్ తర్వాత మరింత వేగంగా మారుతున్నాయి. గత 24 గంటల్లో 24 క్యారెట్/ 22 క్యారెట్ బంగారం ధర రూ.600 నుండి రూ.650 పెరిగింది. ఫిబ్రవరి 3 శుక్రవారం నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 58,470 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53,600.

భారతదేశంలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,610 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర  రూ. 53,750. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,470 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 53,600. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,470 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రూ.53,600గా ఉంది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 మేర పెరిగి రూ.53,600కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,470గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ఒక్కరోజే రూ.1800 పెరిగి  రూ.77,800గా ఉంది.  

 విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.53,600కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.58,470 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.77,800 గా ఉంది.  

భారతదేశంలో బంగారం, వెండి ధర ఫ్యూచర్స్ మార్కెట్ ట్రేడింగ్ ప్రకారం నిర్ణయించబడుతుంది. ట్రేడింగ్ రోజు చివరి ముగింపు మరుసటి రోజు మార్కెట్ ధరగా పరిగణించబడుతుంది.

22 అండ్ 24 క్యారెట్ బంగారం మధ్య వ్యత్యాసం 
24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, 22 క్యారెట్ 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం మృదువైనది. ఈ కారణంగా దాని నుండి నగలు తయారు చేయలేరు.

click me!