బంగారం కొంటున్నారా.. కేంద్ర బడ్జెట్ తరువాత పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజే ధర ఎంత పెరిగిందంటే..?

By asianet news teluguFirst Published Feb 2, 2023, 10:22 AM IST
Highlights

భారతదేశంలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరలకు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.
 

గత 24 గంటల్లో 24 క్యారెట్/ 22 క్యారెట్ బంగారం ధర రూ.1050 పెరిగింది. ఫిబ్రవరి 2 నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 57,910 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ. 53,050.

భారతదేశంలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరలకు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,980 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర  రూ. 53,150. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,820 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 53,000. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,820 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,000గా ఉంది.

ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1950 డాలర్ల మార్కును దాటి ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ $24.20 డాలర్ల వద్ద, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.96 వద్ద ఉంది.

ఈరోజు  02 ఫిబ్రవరి 2023న హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో బంగారం ధరలు పెరిగాయి. పసిడి ధరలు గత రెండు నెలల్లోరూ. 4000 పెరిగింది. ప్రముఖ నగరాల్లో బంగారం ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెంపుతో రూ. 52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 పెంపుతో రూ. 57,820. 

హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 500 పెంపుతో రూ. 53,000, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం  రూ. 550 పెంపుతో రూ. 57,820. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,820. విశాఖపట్నంలో బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ ధర రూ. 52,000, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,820. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 76,000.

click me!