దిగోస్తున్న పసిడి, వెండి.. నిన్నటితో పోల్చితే తగ్గిన ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే..?

Published : Nov 04, 2022, 10:06 AM ISTUpdated : Nov 04, 2022, 10:08 AM IST
 దిగోస్తున్న పసిడి, వెండి.. నిన్నటితో పోల్చితే తగ్గిన ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే..?

సారాంశం

గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. తులం బంగారం నేడు  రూ.150 నుంచి రూ.160 వరకు తగ్గింది. మరోవైపు బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి.

పండగ సీజన్ తరువాత ఇప్పుడు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ మొదలైంది. అయితే నేడు మీకు బంగారం, వెండి  కొనేందుకు మంచి ఛాన్స్.  ఏంటంటే ఈ రోజు అంటే శుక్రవారం బంగారం ధరలు మళ్ళీ  దిగోచ్చాయి. తాజా డేటా ప్రకారం ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.4,669గా ఉంది, నిన్న రూ.4,670గా ఉంది అలాగే ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.5,095గా ఉంది.


గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. తులం బంగారం నేడు  రూ.150 నుంచి రూ.160 వరకు తగ్గింది. మరోవైపు బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.64 వేలకు చేరువలో ఉంది.

0043 GMT నాటికి స్పాట్ బంగారం 0.1% పెరిగి ఔన్సుకు $1,631.33 డాలర్ల వద్ద ఉంది, అయితే ఇప్పటివరకు వారానికి 0.6% తగ్గింది.

యూ‌ఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి $1,633.70 డాలర్లకి చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ అయిన SPDR గోల్డ్ ట్రస్ట్ బుధవారం నాడు 919.12 టన్నుల నుండి గురువారం నాడు 0.82 శాతం తగ్గి 911.59 టన్నులకు పడిపోయిందని తెలిపింది.

స్పాట్ వెండి $19.46 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉంది, ప్లాటినం 0.1% తగ్గి $917.84 డాలర్ల వద్ద, పల్లాడియం $1,800.81 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.

ప్రముఖ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి
సిటీ          22-క్యారెట్    24-క్యారెట్ 
చెన్నై       రూ.47,140    రూ.51,430
ముంబై    రూ.46,690    రూ.50,940
ఢిల్లీ         రూ.46,840    రూ.51,090
కోల్‌కతా    రూ.46,690    రూ.50,940
బెంగళూరు     రూ.46,740    రూ.50,990
హైదరాబాద్   రూ.46,690    రూ.50,940
నాసిక్       రూ.46,720    రూ.50,970
పూణే        రూ.46,720    రూ.50,970
వడోదర    రూ.46,720    రూ.50,970
అహ్మదాబాద్   రూ.46,740    రూ.50,990
లక్నో         రూ.46,840    రూ.51,090
చండీగఢ్   రూ.46,840    రూ.51,090
సూరత్      రూ.46,740    రూ.50,990
విశాఖపట్నం    రూ.46,690    రూ.50,940
భువనేశ్వర్       రూ.46,690    రూ.50,940
మైసూర్    రూ.46,740    రూ.51,990

స్థానిక ధరలు ఇక్కడ చూపిన ధరల కంటే భిన్నంగా ఉండవచ్చు. ఈ ధరలు TDS, GST, విధించబడే ఇతర పన్నులను చేర్చకుండా చూపుతుంది. పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారానికి చెందిన ధరలు. 
 

PREV
click me!

Recommended Stories

Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?
Income Tax: ఇంట్లో డ‌బ్బులు దాచుకుంటున్నారా.? అయితే మీ ఇంటికి అధికారులు రావొచ్చు