Gold Rate: బంగారం ధర భారీగా పడిపోతోంది..ఎంత దాకా తగ్గే ఛాన్స్ ఉందో తెలిస్తే, మహిళలు ఆనందంతో పండగ చేసుకుంటారు

Published : Feb 19, 2023, 01:29 PM IST
Gold Rate: బంగారం ధర భారీగా పడిపోతోంది..ఎంత దాకా తగ్గే ఛాన్స్ ఉందో తెలిస్తే, మహిళలు ఆనందంతో పండగ చేసుకుంటారు

సారాంశం

బంగారం ధర రోజు రోజుకి తగ్గిపోతుంది దీంతో పసిడి ప్రియులకు ఊరట కలుగుతుంది ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారు నగలు చేయించుకునే వారికి ఈ వార్త నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే బంగారం ఎంతవరకు తగ్గ అవకాశం ఉంది ఏమైనా తగ్గవచ్చు అనే దానిపైన ఇప్పటికీ బులియన్ మార్కెట్ నిపుణుల్లో ఏకాభిప్రాయం లేదు.

 ప్రస్తుతం బంగారం రేటు చూసినట్లయితే బంగారం ధర గడచిన వారం రోజుల్లోనే ఏకంగా ఎనిమిది వందల రూపాయలు తగ్గిపోయింది. ఇదే ట్రెండ్ కొనసాగితే బంగారం ధర  55,000 దిగువకు చేరడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బంగారం ధర ప్రస్తుత స్థాయి నుంచి మళ్లీ పెరగవచ్చని, త్వరలోనే రూ. 60,000 స్థాయిని దాటుతుందని మరికొందరు బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 
 
డాలర్ బలపడితే బంగారం ధర తగ్గుతుంది… ఏంటి సంబంధం..
ప్రస్తుతం అంతర్జాతీయంగా గమనించినట్లయితే బంగారం పైన పెట్టుబడులు నెమ్మదిగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా డాలర్ బలపడటం  బంగారం ధర తగ్గడానికి కారణంగా చెప్పవచ్చు డాలర్ ఎంత బలపడితే బంగారం అంత తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.  ఎందుకంటే డాలర్ బలపడే కొద్ది యుఎస్ బాండ్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు మధుపరులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అప్పుడు బంగారంపై  పెట్టుబడులు తగ్గి రిటైల్ బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పటికే బంగారం ధర 1830 డాలర్లు స్థాయిలో ట్రేడ్ అవుతోంది అయితే ఈ క్షణత కొనసాగి 1800 డాలర్ల దిగువకు  పడిపోయే అవకాశం ఉందని ఇదే కనుక జరిగితే బంగారం ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో మనం గమనించినట్లయితే, బంగారం ధరలు 56 వేల నుంచి 57 వేల మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి.  గతంలో బంగారం ధరలు 50 వేల దిగువన ఉండేవి.  అయితే కరోనా సమయంలో అంటే 2020వ సంవత్సరంలో మాత్రం బంగారం ధరలు ఒక్కసారిగా 56 వేల స్థాయిలో రికార్డు స్థాయిని తాకాయి.  ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతూ 50 వేల సమీపంలో రెండు సంవత్సరాల వరకు ట్రేడ్ అవుతూ వస్తున్నాయి.  అయితే దిగివస్తాయా లేదా అనే సందేహం పసిడి ప్రియుల్లో ఉంది.  కానీ బంగారం ఎంత 50 వేల  సమీపంలోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 గత 20 సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే బంగారం ధర నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది 2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర 4400 రూపాయలుగా ఉంది. 2010 సంవత్సరంలో 18500 రూపాయల వద్ద ట్రేడవగా, 2020 సంవత్సరంలో మాత్రం బంగారం ధర 56000  దాటింది. ఈ లెక్కన చూస్తే బంగారం ధర గత 23 సంవత్సరాల్లో 12 రెట్లు పెరిగింది. 

అంటే 2000 సంవత్సరంలో రూ.4.50 లక్షలు ఖర్చు చేసి ఒక కేజీ బంగారం కొని దాచుకుంటే, 2023లో దాని విలువ దాదాపు రూ. 56 లక్షలు పలుకుతోంది. అంటే ఎంత మేర బంగారం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !