Gold, Silver Price Today: పెరుగుతున్న బంగారం, తగ్గుతున్న వెండి ధర, మే 25న గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇవే...

By team teluguFirst Published May 25, 2022, 9:38 AM IST
Highlights

Today Gold Rates In Hyderabad: బంగారం ధరలు ఈ వారం వరుసగా పెరుగుతూ ఉన్నాయి. బంగారం ధరలు ఈరోజు కూడా 10 గ్రాములకు గానూ రూ. 600 చొప్పున పెరిగింది. ముఖ్యంగా పసిడి కొనాలని భావించే వారికి ఇది తగిన కాలం కాదనే చెప్పాలి. అటు  గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటం విశేషం. వెండి ధర కూడా దేశీయంగా తగ్గుముఖం పడుతోంది. ఇది కొద్దిగా సానుకూలాంశం.

అంతర్జాతీయ మార్కెట్‌లోని ట్రెండ్‌కు అద్దం పడుతూ భారతదేశంలో బంగారం ధరలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. రిటైల్ మార్కెట్ విషయానికి వస్తే మే 25న హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ. 660 పెరిగి రూ. 52,090 వద్ద ట్రేడవుతోంది.  అటు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 600 పెరిగి రూ. 47,750కు చేరింది. బంగారం ధర నిన్న కూడా పెరిగింది. గడిచిన 2 రోజుల వ్యవధిలో బంగారం ధర రూ.760 మేర పెరిగింది. 

ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, బంగారం జూన్ ఫ్యూచర్స్ రూ. 103 లేదా 0.20 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 51,010 వద్ద ట్రేడవుతున్నాయి, ఇది క్రితం ముగింపు రూ. 50,907గా ఉంది. సిల్వర్ జులై ఫ్యూచర్స్ కిలో రూ. 66 లేదా 0.11 శాతం తగ్గి రూ.61,237 వద్ద ఉంది. ప్రపంచవ్యాప్తంగా, స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.2 శాతం తగ్గి 1,850.40 డాలర్లకు చేరుకుంది. మే 9 నుండి సోమవారం గరిష్టంగా 1,865.29డాలర్లకు పెరిగింది. రాయిటర్స్ ప్రకారం, US గోల్డ్ ఫ్యూచర్స్ 1,848.20 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఫెడ్ అధికారుల నుండి సానుకూల వ్యాఖ్యల నేపథ్యంలో, డాలర్ ఇండెక్స్ పతనం,  U.S. ట్రెజరీ ఈల్డ్‌లలో కొంత స్థిరత్వం కనిపించింది, బంగారం వ్యాపారం రెండు వారాల గరిష్ట స్థాయికి సమీపంలో స్థిరంగా ఉంది. డాలర్ విలువ కూడా స్థిరంగా ఉంది. COMEXలో బంగారం ఫ్యూచర్స్ ఔన్స్ కు 1830 నుంచి 1895 డాలర్ల రేంజ్‌లో ఉండవచ్చు. ఇక దేశీయంగా బంగారం ధరలు రూ. 50700- 51,200 రేంజ్‌లో ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

తపన్ పటేల్, సీనియర్ అనలిస్ట్ - కమోడిటీస్, హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ మాట్లాడుతూ...బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయని, COMEX వద్ద స్పాట్ గోల్డ్ ధరలు మునుపటి ముగింపుతో పోలిస్తే ఔన్సుకు 1852 డాలర్ల వద్ద  మార్జినల్‌కు సమీపంలో ట్రేడవుతున్నాయని పేర్కొన్నారు. ఉదయం ట్రేడింగ్‌లో డాలర్ ఇండెక్స్‌లో పుంజుకోవడంతో బంగారం ధరలు మునుపటి లాభాలను కోల్పోయాయి. అయితే ప్రపంచ వృద్ధి ఆందోళనలు, అధిక ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు ఇప్పటికీ ఎగువ శ్రేణిలో ట్రేడవుతున్నాయి. COMEX స్పాట్ గోల్డ్ సపోర్ట్  1840 డాలర్ల వద్ద కనిపిస్తుండగా, ప్రతి ఔన్సుకు 1870 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ తో ఈ రోజు  బంగారం ధరలు ట్రేడ్ అవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. MCX గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ సపోర్ట్ రూ. 50600,  రెసిస్టెన్స్  రూ. 10 గ్రాములకు రూ. 51200 వద్ద కనిపిస్తోంది. 

వెండి ధరలు ఇవే...
ప్రపంచ వ్యాప్తంగా వెండి ధరలు తగ్గుముఖం పడుతన్నాయి. ఈరోజు సిల్వర్ ధర భారీగా పడిపోయింది. కేజీ వెండి రేటు రూ.400కు పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ. 66,100 పలుకుతోంది. వెండి ఆభరణాలు, వస్తువులు కొనే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. అటు గ్లోబల్ మార్కెట్‌లో వెండి ధర ఔన్స్‌కు 22 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

click me!