Gold Loan: గోల్డ్ లోన్ కోసం వెతుకుతున్నారా...అయితే ఈ బ్యాంకుల్లో వడ్డీ చాలా తక్కువ...మీరు ఓలుక్కేయండి...

Published : May 23, 2022, 04:01 PM IST
Gold Loan:  గోల్డ్ లోన్ కోసం వెతుకుతున్నారా...అయితే ఈ బ్యాంకుల్లో వడ్డీ చాలా తక్కువ...మీరు ఓలుక్కేయండి...

సారాంశం

కొన్నిసార్లు జీవితంలో అత్యవసరంగా డబ్బు కావాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ అలాంటి సమయాల్లో డబ్బు దొరకడం చాలా కష్టం అవుతుంది. అలాంటి సంక్షోభంలోనూ ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు అనేక ప్రధాన బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCs) బంగారు రుణాలు ఇవ్వడం ప్రారంభించాయి. అయితే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటుకు రుణాలను అందిస్తున్నారో తెలుసుకుందాం. 

గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ లోన్ తక్షణమే వస్తుంది. అంతేకాదు ఆకర్షణీయమైన వడ్డీ రేటు లభిస్తుంది. సిబిల్ స్కోర్, ఎలాంటి క్రెడిట్ హిస్టరీ అవసరం లేకుండానే, గోల్డ్ లోన్ ను  మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఆర్థిక అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేటుతో  గోల్డ్ లోన్‌ను అందిస్తున్న బ్యాంకుల గురించి తెలుసుకుందాం. 

మీరు గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, బ్యాంకు మీ బంగారు ఆభరణాలను  లోన్ నిర్ణీత కాలవ్యవధికి తాకట్టుగా ఉంచుకుంటుంది. బ్యాంకులు రుణంపై వడ్డీ రేటును వసూలు చేస్తాయి.  అలాగే మీరు పూర్తిగా రుణాన్ని తిరిగి చెల్లించిన వెంటనే, బ్యాంకు మీ నగలను మీకు తిరిగి ఇస్తుంది. అయితే పలు బ్యాంకుల అందిస్తున్న వడ్డీ రేట్లను తెలుసుకుందాం. 
 
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank Of Maharashtra)
7 శాతం వడ్డీ రేటుతో గోల్డ్ లోన్‌ను అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు జీఎస్టీతో కలిపి రూ.500 నుంచి రూ.2000 వరకు ఉంటుంది.

కెనరా బ్యాంక్ (Canara Bank)
బ్యాంక్ ప్రస్తుతం 7.35 శాతం వడ్డీ రేటుతో రుణాన్ని అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 500 నుండి రూ. 5000 వరకు ఉంటుంది.

యూనియన్ బ్యాంక్ (Union Bank)
ఈ బ్యాంక్ మీకు 7.25 శాతం నుండి 8.25 శాతం వడ్డీ రేటుతో రుణాన్ని అందజేస్తుంది.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (Punjab And Sindh Bank)
ఈ బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు రూ. 500 నుండి గరిష్టంగా రూ. 10,000 వరకు 7 శాతం నుండి 7.50 శాతం వడ్డీ రేటుతో రుణాలను అందిస్తోంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)
ఈ బ్యాంకు బంగారు రుణాలపై 7 శాతం నుంచి 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
బ్యాంకు సంవత్సరానికి 7.30 శాతం వడ్డీ రేటుతో రుణాలను అందిస్తుంది, 3 సంవత్సరాల కాలవ్యవధికి రూ. 50 లక్షల వరకు రుణం అందజేస్తుంది. ప్రాసెసింగ్ రుసుము లోన్ మొత్తంలో 0.50 శాతం మరియు GSTతో కలిపి కనీసం రూ. 500.

ఈ విషయాలను గుర్తుంచుకోండి
చాలా బ్యాంకులు బంగారు ఆభరణాలను మాత్రమే అంగీకరిస్తాయి మరియు బంగారం స్వచ్ఛత 18K నుండి 22K మధ్య ఉండాలి.  రుణగ్రహీతగా మీరు 6 నెలల నుండి 24 నెలల వరకు ఉండే లోన్ రీపేమెంట్ కాలపరిమితిని ఎంచుకునే హక్కును కలిగి ఉంటారు. మీరు తక్కువ రేటు రుణం పొందగలిగే చోట నుండి రుణం తీసుకోండి.

PREV
click me!

Recommended Stories

RBI Repo Rate Cut: మీకు లోన్ ఉందా, అయితే గుడ్ న్యూస్‌.. ఏ లోన్ పై ఎంత ఈఎమ్ఐ త‌గ్గుతుందో తెలుసా.?
OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది