Gold And Silver Price Today: జోరు పెంచిన బంగారం ధ‌ర‌.. ఎంత‌ పెరిగిందంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : May 31, 2022, 08:37 AM IST
Gold And Silver Price Today: జోరు పెంచిన బంగారం ధ‌ర‌.. ఎంత‌ పెరిగిందంటే..?

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నిన్నటితో పోలిస్తే మంగళ‌వారం కాస్త పెరిగింది. ఇక వెండి ధర నేడు స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.47,850గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.52,200గా ఉంది.  

బంగారం ధర పెరిగింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధర నేడు పైపైకి కదిలింది. హైదరాబాద్‌లో మంగళ‌వారం (మే 31, 2022) 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పైకి చేరింది. రూ. 52,200కు ఎగసింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరుగుదలతో రూ. 47,850కు ఎగసింది. వెండి రేటు కేజీకి రూ. 67 వేల వద్దనే ఉంది. వెండి ధ‌ర‌లో మార్పు లేదని చెప్పుకోవచ్చు. వెండి ధర కూడా రెండు రోజులుగా నిలకడగానే కొనసాగుతూ వస్తోంది. 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు మంగళ‌వారం ఈ విధంగా ఉన్నాయి. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళ‌వారం (మే 31, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..! 

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,200గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,950 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,200 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,850 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,200గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,850 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,200గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 62,500 ఉండగా, ముంబైలో రూ.62,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, కోల్‌కతాలో రూ.62,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, కేరళలో రూ.67,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, విజయవాడలో రూ.67,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Lunar Eclipse: మనదేశంలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించే నగరాలు ఇవే
Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ కావాలంటే మీ జీతం ఎంత ఉండాలి? నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?