
ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) ప్రపంచంలో ఐదో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్‌ను (Warren Buffett) వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని ఆక్రమించారు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం, వారెన్ బఫెట్ నికర విలువ 121.7 బిలియన్ల్ డాలర్లు కాగా.. అదానీ నికర విలువ 123.7 బిలియన్ల డాలర్లుగా ఉంది. యూఎస్ స్టాక్ మార్కెట్ లో శుక్రవారం బెర్క్‌షైర్ హాత్వే షేర్లు 2 శాతం పడిపోయినందున అదానీ.. బఫెట్‌ను అధిగమించగలిగారు. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రస్తుతం అదానీ ఉన్నారు.
మరో భారత వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) 8వ స్థానంలో నిలిచారు. అంబానీ నికర విలువ 104.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫోర్బ్స్ డేటా ప్రకారం చూస్తే.. ప్రపంచంలోని టాప్-10 ధనవంతుల్లో ఇద్దరు భారతీయులు ఉండటం విశేషం.తాజాగా కుబేరుల జాబితాలో అదానీ భారతదేశంలో మొదటిస్థానంలో నిలిచారు.ఇక ఆసియాలోనూ నంబర్ వన్‌గా నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో వారెన్ బఫెట్ ను వెనక్కి నెట్టి ఏకంగా 5వ స్థానంలోకి దూసుకొచ్చాడు.
గౌతమ్ అదానీ మళ్లీ ఇండియా కుబేరుల్లో మొదటి స్థానంలో నిలిచారు. ఆయన సంపద అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా అదానీ 123.7 బిలియన్ డాలర్ల సంపదతో మరోసారి ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్స్ జాబితాలో ప్రపంచంలోనే టాప్ 5వ స్థానాన్ని దక్కించుకున్నాడు. అదానీ వ్యాపారాలు కరోనా టైంలో దూసుకెళ్లాయి. ఒక్క 2022లోనే ఆయన సంపద 43 బిలియన్ డాలర్లు పెరిగింది. మొత్తంగా అదానీ సంపద ఈ ఏడాదిలో 56 శాతం పెరిగింది. ఇక భారత్ తోపాటు ఆసియాలోనే కుబేరుడిగా మొదటి స్థానంలో కొనసాగిన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీని వెనక్కి నెట్టి తొలిసారి ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ టాప్ 5లోకి దూసుకెళ్లారు.
ఈ జాబితాలో ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా ఎలాన్ మస్క్ 269.7 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 170.2 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో.. బెర్నాల్డ్ అర్నాల్డ్ 167.9 బిలియన్ డాలర్లతో మూడో స్తానంలో.. బిల్ గేట్స్ 130.2 బిలియన్ డాలర్లతో 4వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ మాత్రం పోర్టులు సరుకుల రవాణా మెగా ప్రాజెక్టులు మౌళిక సదుపాయాల రంగంలో వ్యాపారం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే అంబానీని దాటేసి నంబర్ 1 స్థానానికి చేరారు.