Nirmala Sitharaman: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ లక్ష్యం..వాటిని మూసివేయడం కాదు, మరింత సమర్థవంతంగా నడిపించడమే

Published : Jun 11, 2022, 12:28 PM IST
Nirmala Sitharaman: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ లక్ష్యం..వాటిని మూసివేయడం కాదు, మరింత సమర్థవంతంగా నడిపించడమే

సారాంశం

ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం వెనుక ఉన్న సూత్రం పబ్లిక్ ఎంటిటీ లేదా కంపెనీని మరింత సమర్థవంతంగా నడపడమే తప్ప దాన్ని మూసివేయడం కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం అన్నారు. 

1994 - 2004 మధ్య ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు చేతులకు అప్పగించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఈ సంస్థలు వృత్తిపరంగా నడిచే బోర్డులచే నిర్వహించబడుతున్నాయని, వాటి పనితీరు మెరుగుపడిందని సీతారామన్ అన్నారు.

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కింద నిర్వహించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) కార్యక్రమంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సిపిఎస్‌ఇ) ప్రైవేటీకరణ లక్ష్యం ఈ కంపెనీలు సమర్థవంతంగా నిర్వహించడం కోసం మాత్రమే అని పేర్కొన్నారు. 

ఆర్థిక వ్యవస్థకు సహకారం పెంచడమే పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం...
నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, “ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్న సూత్రం ఒక్క సంస్థను మూసివేయకుండానే, ఆర్థిక వ్యవస్థకు ఇలాంటి మరిన్ని కంపెనీలు అవసరం. కాబట్టి, మేము ఆ పనిని వృత్తిపరంగా చేసే వ్యక్తులు లేదా సంస్థలకు వాటిని అప్పగిస్తామని, అంతే కానీ మూసివేయడం మాకు ఆసక్తి లేదని తెలిపారు.

ఆర్థిక వ్యవస్థకు దోహదపడేలా వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని కోరుకుంటున్నాము. ప్రైవేటీకరణ ద్వారా కంపెనీలను నడిపించే సత్తా ఉన్న వారి చేతుల్లో ఉండేలా చూసుకోవడమే పెట్టుబడుల ఉపసంహరణ సూత్రమని ఆమె అన్నారు.

పెట్టుబడుల ఉపసంహరణ జాబితాలో 6 కంటే ఎక్కువ కంపెనీలు ఉన్నాయి
ప్రభుత్వం వ్యూహాత్మక విక్రయం కోసం అర డజనుకు పైగా పబ్లిక్ కంపెనీలను జాబితా చేసింది. వీటిలో షిప్పింగ్ కార్ప్, కాంకర్, వైజాగ్ స్టీల్, IDBI బ్యాంక్, NMDC నాగర్నార్ స్టీల్ ప్లాంట్, HLL లైఫ్‌కేర్ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.24,000 కోట్లకు పైగా సమీకరించింది.

మొత్తం ఆర్థిక సంవత్సరానికి రూ.65,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ద్వారా వచ్చిన మొత్తంతో సహా, కేంద్ర సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.13,500 కోట్లకు పైగా వచ్చాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !