
ప్రపంచంలోని కార్పొరేట్ సంస్థల సీఈవోల్లో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవో ఎవరో తెలుసా.. ఇంకెవరు.. టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్‌మస్క్. ఫార్చ్యూన్-500 సంస్థల సీఈవోల్లో అత్యధిక వేతనం అందుకుంటున్నారు. ఫార్చ్యూన్ -500లో టాప్-10 సీఈవోల్లో మస్క్ ఒకరు. మస్క్ తర్వాత జాబితాలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్, నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన రీడ్ హాస్టింగ్స్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఉన్నారు. ఇందులో టెక్, బయోటెక్ సంస్థల అధినేతలు కూడా ఉన్నారు.
గతేడాది (2021)లో ఎలాన్‌మస్క్ పొందిన వేతనం 23.5 బిలియన్ల డాలర్లు. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో టెస్లా 65వ స్థానంలో నిలిచింది. 2020తో పోలిస్తే 71 శాతం ఆదాయం పెంచుకున్న టెస్లా గతేడాది ఆదాయం 53.9 బిలియన్ డాలర్లు. గతేడాది టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనం 770.5 మిలియన్ల డాలర్లు. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో ఆపిల్‌కు మూడో స్థానం ఉంది. అంతర్జాతీయంగా చిప్ కొరత సమస్యను ఎదుర్కొన్నా ఆపిల్ ఉత్పత్తులు మాత్రం విజయవంతంగా కొనసాగిస్తూనే ఉంది. కాగా, న్విదియా సంస్థ కో ఫౌండర్ హాంగ్, నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హాస్టింగ్స్ వేతనాల్లో మూడో, నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.
ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి భారత్‌లో ఆరోపణలు గుప్పించారు. టెస్లా కార్ల దిగుమతికి పన్ను రాయితీ ఇవ్వని కారణంగానే భారత్‌కు టెస్లా కార్లు రావడం లేదని స్పష్టం చేశారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇక్కడే కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం ఎప్పటి నుంచో కోరుతోంది. దీనిపైనా మస్క్ క్లారిటీ ఇచ్చారు. భారత్‌లో టెస్లా కార్ల యూనిట్ ఏర్పాటు చేసే ఆలోచనే లేదని తేల్చి చెప్పాడు. అందుకు భారత్ విధానాలే కారణమంటూ మరోసారి ఆరోపించారు. తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సేవలకు ఇండోనేషియా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని మస్క్ చెప్పారు.