
శ్రీలంక దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో పలు ఆసియా దేశాలకు హెచ్చరికలు పంపారు. దీని తర్వాత బ్లూమ్‌బెర్గ్ ఎకనామిస్ట్స్ సర్వే నివేదికను ప్రచురించింది. 14 ఆసియా దేశాలు ఆర్థిక మాంద్యం ఎదుర్కొనే అవకాశం ఉందని ఈ నివేదికలో పేర్కొంది. అయితే ఈ నివేదికలో భారతదేశం ఆర్థిక మాంద్యం ఎదుర్కొనే అవకాశం లేదని తెలిపింది. అంతర్జాతీయ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు, అధిక అప్పుల కారణంగా ఆసియా దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని సర్వే రిపోర్ట్ పేర్కొంది. శ్రీలంక ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వచ్చే ఏడాది శ్రీలంక ఆర్థిక మాంద్యం 85 శాతం ఎదుర్కొనే అవకాశం ఉందని, తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ ఉంది. అయితే న్యూజిలాండ్ ఆర్ధిక మాంద్యం ఎదుర్కొనే అవకాశం 33 శాతం ఉందని మరోవైపు ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉందని తెలిపింది.
ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. భారీ అప్పులు, ప్రభుత్వ ఉచిత ప్రకటనలు ఖజానాపై భారం పడుతున్నాయి. ఈ కారణాల వల్ల తిరిగి చెల్లించే బదులు అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది అని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ఈ ఆందోళనను జోడించింది.
ఆర్థిక మాంద్యం బారిన పడే దేశాలలో శ్రీలంక, న్యూజిలాండ్ తర్వాత దక్షిణ కొరియా ఉంది. దక్షిణ కొరియా 25 శాతం ఆర్థిక సంకోచాన్ని అనుభవించే అవకాశం ఉందని, జపాన్‌కు 25 శాతం ఆర్థిక దెబ్బ తగులుతుందని అంటున్నారు. చైనా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, తైవాన్, పాకిస్థాన్‌లు 20 శాతం ఆర్థికంగా దెబ్బతింటాయని చెబుతున్నారు. మలేషియా 13 శాతం, వియత్నాం, థాయ్‌లాండ్‌లు 10 శాతం మాంద్యాన్ని చవిచూస్తాయని చెప్పారు. పిలిపినాస్ 3 శాతం ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది.
బ్లూమ్‌బెర్గ్ భారత్‌పై కూడా సర్వే నివేదికను విడుదల చేసింది. భారత్ ఆర్ధిక మాంద్యం ఎదుర్కొనే అవకాశం శూన్యం అని తెలిపింది. యూరప్, అమెరికాలతో పోలిస్తే ఆసియా ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకంగా ఉంది. పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల కారణంగా జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు తీవ్రంగా నష్టపోయాయని మూడీస్ అనలిటిక్స్ ఆసియా పసిఫిక్ ఎకనామిస్ట్ స్టీవెన్ కొక్రాన్ తెలిపారు.
ఈ ఆర్థిక సర్వే రిపోర్టులో మరో ముఖ్యమైన అంశం వెల్లడైంది. మొత్తం ఆసియా ఆర్ధిక మాంద్యం ప్రమాదం 20 నుండి 25 శాతం అని, కానీ అమెరికా 40 శాతం, యూరప్ 50 నుంచి 55 శాతం అని తెలిపింది. రాబోయే 12 నెలల్లో US ఆర్ధిక మాంద్యం 38 శాతం అని సూచించింది.