
ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే కన్నా వ్యాపారంలో సక్సెస్ అయితే అంతకన్నా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది ప్రస్తుతం అలాంటి వ్యాపారం గురించి ఇప్పుడు చూద్దాం. ఏ సీజన్ అయినా ఫుడ్ బిజినెస్ కు తిరుగులేదు అనే చెప్పాలి ముఖ్యంగా జనాభా పెరిగే కొద్దీ ఈ రంగంలో డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. కావున దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు చక్కటి ఫుడ్ బిజినెస్ ప్లాన్ చేసుకుంటే ప్రతినెలా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది అలాంటి ఓ ఫుడ్ బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది
ఈ మధ్యకాలంలో సరదాగా ఫ్రెండ్స్ ప్రైస్ తినే కల్చర్ బాగా పెరిగిపోయింది. పార్కులు సినిమా థియేటర్లు మాల్స్ ఇలా అన్నిచోట్ల కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ తినేందుకు జనాలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు మీరు కూడా దీని వ్యాపార అవకాశంగా మలుచుకునే అవకాశం ఉంది. అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే ఛాన్స్ ఉంటుంది.
మీరు దీన్ని ఒక ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయడం ద్వారా, ఈ వ్యాపారం ప్రారంభించి డబ్బు సంపాదించవచ్చు. ఈ ఫుడ్ స్టాల్ కోసం French Fryer Machine కొనుగోలు చేయాలి. దీని ధర రూ.30 వేల వరకూ ఉంటుంది. మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ ముడి సరుకును మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు ప్రాసెస్ చేసినటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్ మార్కెట్లో లభిస్తాయి. వీటిని తెచ్చుకొని ఫ్రైయర్ మిషన్ లో నూనె పోసి వేయిస్తే చాలు. ఒక్కో ప్యాకెట్టు 50 రూపాయలకు విక్రయించవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ తో పాటు మయనేజు సాసు కూడా టమాటో సాస్ అందించాల్సి ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కు డిఫరెంట్ ఫ్లేవర్స్ అద్ది అమ్మడం ద్వారా చక్కటి సేల్స్ సాధించే అవకాశం ఉంటుంది.
ఇక మీరు ఈ ఫుడ్ స్టాల్ ను పార్కులు, ఎంయూజ్మెంట్ పార్కులు, సినిమా థియేటర్లు, మాల్స్ అలాగే జన సమర్థత ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటే చక్కగా వర్కౌట్ అవుతుంది. బిజినెస్ బాగుంటే ప్రతిరోజు కనీసం మూడు వేల నుంచి 5000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన చూసినట్టయితే నెలకు కనీసం 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం మీకు దక్కుతుంది.