Nirmala Sitharaman : ఆర్థికమంత్రి ఆస్తులు ఇవే..

By SumaBala BukkaFirst Published Feb 1, 2024, 9:16 AM IST
Highlights

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ప్రస్తుతం ప్రభుత్వ చివరి బడ్జెట్ ను ఓట్ ఆన్ అకౌంట్ గా ఆమె దీన్న సమర్పించనున్నారు. 

ఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. దేశ రెండో మహిళా ఆర్థిక మంత్రిగా, పూర్తికాలం పదవీ బాధ్యతలు నిర్వహించిన మొట్టమొదటి మహిళా ఆర్థికమంత్రిగా, యేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయ బ్రీఫ్ కేస్ స్థానంలో బహిఖాతాను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా, పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఎన్నో ప్రత్యేకతలు తన ఖాతాలో వేసుకున్నారు. 

ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు, ఆమె స్థిర, చర ఆస్తులు, సంపాదన... వివరాలు ఇవి.. 

2022లో ఎన్నికల అధికారులకు సమర్పించిన వివరాల ప్రకారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్తుల నికర విలువ రూ. 2,50,99,396 కోట్లు.

నిర్మల ఆస్తి వివరాలు : మొత్తం ఆస్తి విలువ రూ. 2,50,99,396, 
స్థిరాస్తి : రూ. 1,87,60,200 
చరాస్తులు: రూ. 63,39,196 
నగలు: 315 గ్రా. బంగారం, 2 కిలోల వెండి, 
నగదు: రూ. 17,200, 
బ్యాంక్ FD : రూ. 45,04,479, 
స్కూటర్: బజాజ్ చేతక్, కారు: కారు లేదు, 
రుణం: రూ. 30,44,838 
కుటుంబ సభ్యులకు ఇచ్చిన రుణం: రూ. 3,50, 000, 
ఆంధ్ర ప్రదేశ్ లోని రంగారెడ్డి జిల్లా కుంతనూరు గ్రామంలో భూమి: 4,806 చ.అ.

Nirmala Sitharaman : దేశ ఆర్థిక మంత్రిగా మారిన ఒక సేల్స్ గర్ల్ స్టోరీ...

ఆస్తులు: రూ. 2,63,77,861 ~2 కోట్లు+
బాధ్యతలు: రూ. 73,07,458 ~73 లక్షలు+

నిర్మలా సీతారామన్ కు నాలుగు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. వీటిల్లో రూ. 8,44,935 ఉన్నాయి. ఆమె ఎలాంటి ఆదా పథకంలో పెట్టుబడి పెట్టలేదు. 

ఇక ఆర్థికమంత్రి నెల జీతం విషయానికి వస్తే.. 2019లో వెలువడిన డేటా ప్రకారం.. భారత ప్రభుత్వం జీతం, అలవెన్సులు, పార్లమెంటు సభ్యుల పెన్షన్ చట్టం, 1954 ప్రకారం, ఆర్థిక మంత్రి నెలవారీ జీతం సుమారుగా నెలకు రూ. 4,00,000 (4 లక్షలు) ఉంటుంది. ఇది నెలకు సుమారు 5,500అమెరికన్ డాలర్లకి సమానం.

ఆర్థిక మంత్రి పదవీకాలం సాధారణంగా పాలక ప్రభుత్వ పదవీకాలంతో సమానంగా ఉంటుంది. ఆమె తన పదవీకాలంకంటే ముందుగానే రాజీనామా చేస్తే లేదా ముందుగా భర్తీ చేయకపోతే దీంట్లో మార్పులు ఉండొచ్చు. భారత ప్రభుత్వ ప్రస్తుత పదవీకాలం మే 30, 2019న ప్రారంభమైంది. 2024, ఎన్నికలతరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ముగుస్తుంది. 

click me!