వాహనదారులకు షాక్... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

By ramya neerukondaFirst Published Aug 27, 2018, 2:07 PM IST
Highlights

హైద‌రాబాద్‌లో చాలా రోజుల నుంచి రూ.80 పై నుంచి పెట్రోల్ ధ‌ర దిగిరావ‌డం లేదు. డీజిల్ ధ‌ర 14 నుంచి 25 పైస‌లు పెరిగింది. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెరిగిన కార‌ణంగానే దేశంలో చ‌మురు కంపెనీలు ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచాయి.

వాహనదారులకు షాకిచ్చేలా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.77.78కి చేరుకోగా.. డీజిల్ ధర రూ.69.32కు చేరుకుంది. ఇక ముంబ‌యి, చెన్నై, బెంగుళూరు న‌గ‌రాల్లో పెట్రోలు ధ‌ర రూ.80కి పైనే ఉంది. హైద‌రాబాద్‌లో చాలా రోజుల నుంచి రూ.80 పై నుంచి పెట్రోల్ ధ‌ర దిగిరావ‌డం లేదు. డీజిల్ ధ‌ర 14 నుంచి 25 పైస‌లు పెరిగింది. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెరిగిన కార‌ణంగానే దేశంలో చ‌మురు కంపెనీలు ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచాయి.

కోలకత్తాలో పెట్రోల్ ధర రూ.80.83గా ఉండగా.. డీజిల్ ధర రూ.73.27గా ఉంది. ముంబయి నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.    85.20 కాగా.. డీజిల్ ధర రూ.73.59కు చేరుకుంది.చెన్నై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.80కి చేరగా.. డీజిల్ ధర రూ.73.23 గా ఉంది.బెంగుళూరు లో లీటర్ పెట్రోల్ ధర రూ.80.30చేరుకోగా, డీజిల్ ధర రూ.71.54 కి చేరింది. ఇక హైద‌రాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.46కు చేరుకోగా, డీజిల్ ధర రూ.75.40 కి చేరింది.

click me!