CNG car: కారు కొనాలనుకుంటున్నారా? CNG అయితే బెస్ట్. ఎందుకంటే అమ్మకాలు 35 శాతం పెరిగాయి

Published : Jun 18, 2025, 05:45 PM ISTUpdated : Jun 18, 2025, 05:47 PM IST
tata punch cng

సారాంశం

CNG car: మీరు కారు కొనాలనుకుంటున్నారా? అయితే CNG కారు అయితే బెస్ట్. ఎందుకంటే 2024లో CNG కార్ల అమ్మకాలు 35 శాతం పెరిగాయి. పెట్రోల్, డీజిల్ కార్ల కంటే CNG కార్లు కొనేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణాలేంటో తెలుసుకుందామా?

భారత్‌లో సీఎన్‌జీ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. మొత్తం అమ్మకాల్లో 35 శాతం వృద్ధి నమోదైందని తాజా పరిశ్రమ నివేదికలు వెల్లడించాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ఎలక్ట్రిక్ వాహనాలపై కొనుగోలుదారుల్లో నమ్మక లోపం, లిక్విడ్ ఫ్యూయల్స్‌పై ప్రభుత్వ నియంత్రణల వల్ల ఈ వృద్ధి సాధ్యమైందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

సీఎన్‌జీ వాహనాల వృద్ధి ఎలా జరిగిందంటే..

2024లో సీఎన్‌జీ కార్ల అమ్మకాలు 1,15,432 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది 2023తో పోల్చితే 16.13 శాతం పెరిగింది. మొత్తం 71,811 వాహనాలను మారుతీ సుజుకీ విక్రయించింది. టాటా మోటార్స్ అయితే 15,815 సీఎన్‌జీ వాహనాలు అమ్మింది.

SIAM గణాంకాల ప్రకారం డీజిల్ కార్ల అమ్మకాలు 17 శాతం నుండి 19 శాతానికి పెరిగాయి. కానీ సీఎన్‌జీ వాహనాల కొనుగోలుకే వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 

CNG కార్ల కు ఎందుకు డిమాండ్ పెరుగుతోంది?

CNG కార్ల కు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు ధర రూ. 100 కి పైగా ఉంది. డీజిల్ ధర కూడా అదే స్థాయిలో ఉంది. ఇటువంటి సమయంలో తక్కువ నడక ఖర్చు ఉన్న CNG వాహనాలు ప్రజలకు ఆకర్షణీయంగా మారాయి.

ఉదాహరణకు 1 కిలో CNG ధర సుమారుగా రూ.75 - రూ.80 ఉంటుంది. CNG వాహనం లీటరు నడక ఖర్చు రూ.2.5 నుండి రూ.3 మధ్యలో ఉంటుంది. అదే పెట్రోల్ వాహనంతో పోలిస్తే ఖర్చు రూ.6 - రూ.8 మధ్యలో ఉంటుంది. ఇది నెలకు చూస్తే పెద్ద మొత్తంలో పొదుపు అవుతుంది. 

ఎలక్ట్రిక్ వాహనాలపై సందేహాలు 

ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్తుకి మార్గం అని అనిపిస్తున్నా, వాటిపై ప్రజల్లో ఇంకా పూర్తిగా నమ్మకం లేదు. ముఖ్యంగా EV వాహనాల్లో కనిపించే ప్రధాన సమస్యలు వాటిని కొనడానికి భయపడేలా చేస్తున్నాయి. వీటికి తోడు ఛార్జింగ్ స్టేషన్ల కొరత వినియోగదారుల్లో తీవ్ర నిరాశకు కారణం అవుతోంది. అంతేకాకుండా బ్యాటరీ లైఫ్‌పై ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కొన్ని వాహనాల్లో బ్యాటరీలు పేలడం, ఇలాంటి వార్తలు చూసి ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ప్రజలు అస్సలు ఆసక్తి చూపించడం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా భారీగా ఉండటం మరో కారణం. లాంగ్ డ్రైవ్ కి వెళ్లడానికి అవకాశం లేకుండా ఉండటం కూడా ఈవీలను కొనుగోళ్లు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. 

ఈ పరిస్థితుల్లో, CNG వాహనాలు మధ్యస్థ మార్గంగా కనిపిస్తున్నాయి. ఇవి EVల కంటే తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటూ, పెట్రోల్ వాహనాలకు బదులుగా ఉపయోగించగలిగే ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.

సబ్సిడీలు, ప్రభుత్వ ప్రోత్సాహాలు

భారత ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు CNG వాహనాల ప్రోత్సాహానికి పలు చర్యలు తీసుకుంటున్నాయి. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా CNG వాహనాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీల రాయితీలు తగ్గించాయి. గ్రీన్ ట్యాగ్ వాహనాలకు పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి. దీనికి తోడు CNG పంపుల సంఖ్యను వేగంగా పెంచుతున్నాయి. 

ఉదాహరణకు 2021లో దేశంలో ఉన్న CNG పంపులు 1,400 మాత్రమే ఉండేవి. 2024 నాటికి అవి 5,700కి పెరిగాయి. 2025 నాటికి ఈ సంఖ్య 10,000కి చేరే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది.

వాహన తయారీ సంస్థల దృష్టి మార్పు 

పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ప్రధాన వాహన తయారీ కంపెనీలు CNG వేరియంట్లపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు తమ ఫేమస్ మోడళ్లకు CNG వేరియంట్లు విడుదల చేస్తున్నాయి.

మారుతీ కంపెనీలో వాగన్ ఆర్, ఎర్టిగా, సెలెరియో వంటి మోడళ్లలో CNG వేరియంట్లు ఉన్నాయి. టాటా కంపెనీలో అయితే పంచ్, ఆల్ట్రోజ్ వంటి మోడళ్లకు CNG వేరియంట్స్ ఉన్నాయి. హ్యుందాయ్ లో Aura CNG వేరియంట్ మంచి డిమాండ్‌లో ఉంది. 

ఈ బ్రాండ్ల విశ్వసనీయత మరియు CNG వాహనాల పెరుగుతున్న ఎంపికలు వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి.

భవిష్యత్ అంచనాలు

పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం 2025 నాటికి మొత్తం వాహనాల్లో CNG వాటా 25 శాతానికి చేరే అవకాశం ఉంది. 2021లో ఇది కేవలం 11 శాతమే ఉండగా, ప్రస్తుతం దాని డిమాండ్ రెట్టింపు అవుతోంది.

భారత్‌లో ప్రస్తుతం CNG స్టేషన్ల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇది వినియోగదారులకు మరింత అనుకూలతను కలిగిస్తుంది.

పెట్రోల్ ధరల పెరుగుదల, ఎలక్ట్రిక్ వాహనాల పరిమితులు, ప్రభుత్వ ప్రోత్సాహాల ప్రభావంతో 2024లో CNG వాహనాల డిమాండ్ భారీగా పెరిగింది. మారుతీ సుజుకీ, టాటా వంటి బ్రాండ్లు ఈ విభాగంలో దూసుకెళ్తున్నాయి. 2025 నాటికి ఇది మరింతగా విస్తరించే అవకాశం ఉంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?