ఈ సంవత్సరం జూలై నుంచి పెట్రోల్ తో నడిచే టూ వీలర్ వాహనాల రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నట్లు చండీగఢ్ నగర అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. కాలుష్య నివారణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే నగరంలో అనుమతిస్తామని అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
ఈ ఏడాది జూలై నుంచి పెట్రోల్‌తో నడిచే టూవీలర్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేస్తామని చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రకటించింది. నాన్-ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ గడువు త్వరలో ముగియనున్నందున, నాన్-ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల రిజిస్ట్రేషన్ కూడా డిసెంబర్ నాటికి ఆగిపోతుందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక నివేదిక పేర్కొంది. ఈ విధానం కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్లడానికి చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ప్రణాళికలో భాగం. దీనికి, నగర పాలక సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది, “నగరంలో మెరుగైన పర్యావరణం కాలుష్య రహిత ప్రయాణం లక్ష్యాన్ని సాధించడానికి, చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2022ని నోటిఫై చేసింది.
గత ఏడాదితో పోలిస్తే 2022లో ఫోర్ వీలర్ వాహనాల సంఖ్యను 10 శాతం, టూవీలర్ వాహనాల సంఖ్యను 35 శాతానికి తగ్గించాలనే లక్ష్యంతో ఈ నిషేధం విధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో ఫోర్ వీలర్ వాహనాలను 20 శాతం, టూవీలర్ వాహనాల ను 70 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పెట్రోల్, డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌పై నిషేధం గురించి చండీగఢ్ రవాణా శాఖ డైరెక్టర్ ప్రద్యుమాన్ సింగ్ మాట్లాడుతూ, “6202 వాహనాల రిజిస్ట్రేషన్ తర్వాత నాన్-ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాల రిజిస్ట్రేషన్ జరగదని. అదేవిధంగా, 22,626 నాన్-ఎలక్ట్రిక్ వాహనాల ఫోర్ వీలర్ల రిజిస్ట్రేషన్ తర్వాత, ఫోర్ వీలర్ వాహనాల రిజిస్ట్రేషన్ కూడా జరగదని పేర్కొన్నారు.
నాన్-ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాలకు విధించిన పరిమితిని జూలై మొదటి వారం నాటికి సాధించవచ్చని భావిస్తున్నట్లు సింగ్ తెలిపారు. ఫోర్ వీలర్ వాహనాల విషయానికొస్తే, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ పరిమితిని చేరుకోవచ్చని భావిస్తున్నారు.
బయటి నుంచి వచ్చే వాహనాలను ఎలా ఆపగలరు..ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అభ్యంతరం..
ఈ నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ చండీగఢ్ రీజియన్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయమని ప్రభుత్వం ప్రజలను బలవంతం చేస్తోందని, ఇది ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతుందని పేర్కొంది.
పెట్రోలు-డీజిల్ వాహనాల డీలర్ల వద్ద ప్రస్తుతం సుమారు రూ. 100 కోట్ల విలువైన వాహనాలు ఉన్నాయని, అంతేకాదు డీలర్‌షిప్ ఏర్పాటుకు ఐదు కోట్ల రూపాయలు ఖర్చయిందని అసోసియేషన్ తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ఆటోమొబైల్ డీలర్లు దివాళా తీస్తారని ఆందోళన వ్యక్తం చేసింది.
నాన్-ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిషేధించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని డీలర్ల సంఘం పేర్కొంది, ఎందుకంటే రాష్ట్రం వెలుపల నుండి వచ్చే వాహనాలు చండీగఢ్ రోడ్లపై కొనసాగుతాయి. ఈ నిర్ణయం వల్ల ప్రజలు ఖరీదైన తక్కువ నాణ్యత గల ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయవలసి వస్తుందని అసోసియేషన్ తన అభ్యంతరాన్ని తెలిపింది.