గ్రేట్ డిజైన్, ఆమోలెడ్ డిస్ ప్లేతో బౌల్ట్ రోవర్ కొత్త స్మార్ట్.. ఫీచర్లు అండ్ ధర గురించి తెలుసుకోండి

By asianet news teluguFirst Published Dec 23, 2022, 6:48 PM IST
Highlights

ఈ వాచ్ క్లాసిక్ స్విచ్ అండ్ ఫ్లిప్ వెర్షన్లలో అందించబడుతుంది. వాచ్  క్లాసిక్ స్విచ్ మోడల్ బ్రౌన్ లెదర్ ప్రైమరీ స్ట్రాప్ ఇంకా ఆరెంజ్ లెదర్ సెకండరీ స్ట్రాప్‌తో వస్తుంది. వాచ్  ఫ్లిప్ వెర్షన్  స్టాండర్డ్ బ్లాక్ పట్టీలతో అందుబాటులో ఉంటుంది. 

ఇండియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోల్ట్ ఒక  కొత్త స్మార్ట్ వాచ్ బోల్ట్ రోవర్‌ను లాంచ్ చేసింది. బోల్ట్ రోవర్ కి 1.3-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 600 నిట్‌ల  బ్రైట్ నెస్ తో పరిచయం చేసింది. బ్లూటూత్ కాలింగ్‌ కూడా బోల్ట్ రోవర్ తో సపోర్ట్ చేశారు. బోల్ట్ రోవర్‌  150 కంటే ఎక్కువ క్లౌడ్ బెసేడ్ వాచ్‌ఫేస్‌లకు సపోర్ట్ ఉంది. వాచ్‌తో 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఈ వాచ్  ఇతర స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం...

బౌల్ట్ రోవర్ ధర 
ఈ వాచ్ క్లాసిక్ స్విచ్ అండ్ ఫ్లిప్ వెర్షన్లలో అందించబడుతుంది. వాచ్  క్లాసిక్ స్విచ్ మోడల్ బ్రౌన్ లెదర్ ప్రైమరీ స్ట్రాప్ ఇంకా ఆరెంజ్ లెదర్ సెకండరీ స్ట్రాప్‌తో వస్తుంది. వాచ్  ఫ్లిప్ వెర్షన్  స్టాండర్డ్ బ్లాక్ పట్టీలతో అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు గ్రీన్ ఇంకా బ్లూ కలర్ స్ట్రాప్ ఆప్షన్ కూడా  ఉంది. బోల్ట్ రోవర్ ధర రూ.2,999. ఈ వాచ్‌ని ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు.

బౌల్ట్ రోవర్ స్పెసిఫికేషన్ అండ్ ఫీచర్లు
1.3-అంగుళాల HD AMOLED డిస్ ప్లే  బోల్ట్ రోవర్‌తో సపోర్ట్ చేశారు. డిస్‌ప్లేతో 600 నిట్‌ల  బ్రైట్ నెస్, 150 కంటే ఎక్కువ క్లౌడ్ బేస్డ్ వాచ్‌ఫేస్‌లకు సపోర్ట్ అందించారు. వాచ్ లో నావిగేషన్ కోసం ఫిజికల్ బటన్‌  ఉంది. జింక్ అలయ్ బిల్ట్ క్వాలిటీ వాచ్‌తో ఉంది. బోరోవర్‌తో బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్ట్ ఉంది. అంతేకాదు కాల్స్ చేయడానికి ఇన్‌బిల్ట్ స్పీకర్, మైక్‌తో వస్తుంది. 

బౌల్ట్ రోవర్  బ్యాటరీ లైఫ్ 
హార్ట్ రేట్ సెన్సార్, SpO2 సెన్సార్, స్లీప్ మానిటర్, పీరియడ్ ట్రాకర్ వంటి హెల్త్ ట్రాకింగ్ వాచ్‌లో  సపోర్ట్ ఉంది. రన్నింగ్, స్విమ్మింగ్, వాకింగ్  వంటి మాల్టీ స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఉంది. స్మార్ట్‌వాచ్‌తో 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ క్లెయిమ్ అందించారు. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కోసం వాచ్‌తో IP68 రేటింగ్ ఉంది. 

click me!