నేటి నుంచి Bikaji Foods IPO ప్రారంభం, నవంబర్ 7 వరకూ అవకాశం, పూర్తి వివరాలు తెలుసుకోండి..

Published : Nov 03, 2022, 08:23 PM IST
నేటి నుంచి Bikaji Foods IPO ప్రారంభం, నవంబర్ 7 వరకూ అవకాశం, పూర్తి వివరాలు తెలుసుకోండి..

సారాంశం

బికాజీ ఫుడ్స్ కంపెనీ IPO నవంబర్ 3న (గురువారం) ప్రారంభమైంది. ఈ ఇష్యూ పూర్తిగా అమ్మకానికి సంబంధించిన ఆఫర్. అంటే ఈ ఇష్యూ ద్వారా కంపెనీ ప్రమోటర్లు తమ షేర్లను విక్రయించనున్నారు. ఇష్యూ నుండి సేకరించిన డబ్బు కంపెనీకి వెళ్లదని గమనించాలి.   

బికాజీ ఫుడ్స్ కంపెనీ IPO నవంబర్ 3 అంటే నేటి నుంచి ప్రారంభమైంది ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ కంపెనీ ప్రకటనలో కనిపించడం వల్ల చాలా మందికి బికాజీ ఫుడ్స్ గురించి తెలుసు. యాడ్ ట్యాగ్‌లైన్ - అమిత్‌జీ బికాజీని ప్రేమిస్తున్నాడు. కానీ, బికాజీ ఐపీఓను ఇన్వెస్టర్లు ప్రేమిస్తారా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.  

ఇదిలా ఉంటే చాలా మంది విశ్లేషకులు ఈ IPOలో పెట్టుబడి పెట్టుకోవచ్చని ఇన్వెస్టర్లకు  సలహా ఇచ్చారు. అయితే, ఈ ఇష్యూలో షేర్ల ధరలు చాలా ఎక్కువగానే ఉన్నాయని ఇన్వెస్టర్లు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా కంపెనీ ప్రమోటర్లు తమ షేర్లను మాత్రమే విక్రయించేందుకు అవకాశం కల్పించడం ఈ ఇష్యూ ఉద్దేశ్యమని చెబుతున్నారు.  అంటే ఈ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను కంపెనీ అభివృద్ధికి ఉపయోగించరు. 

ఈ ఇష్యూ ద్వారా రూ.881 కోట్ల విలువైన షేర్లను విక్రయించేందుకు ప్రమోటర్లకు కంపెనీ అవకాశం కల్పిస్తోంది. మీరు నవంబర్ 7 వరకు ఈ IPOలో పెట్టుబడి పెట్టవచ్చు. కంపెనీ ప్రైస్ బ్యాండ్ రూ.285-300గా ఉంచింది. ఇప్పటికే 36 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.262.11 కోట్లు సమీకరించినట్లు కంపెనీ నవంబర్ 2న వెల్లడించింది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరు ధర రూ.300 చొప్పున కంపెనీ షేర్లను కేటాయించింది. ఒక్కో లాట్ కు కనీసం 50 షేర్లు కొనుగోలు చేయాలి. అంటే మినిమం పెట్టుబడి 14250 రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. 

యాంకర్ ఇన్వెస్టర్లలో సింగపూర్ ప్రభుత్వం, ICICI ప్రుడెన్షియల్, HDFC మ్యూచువల్ ఫండ్, నిప్పన్ లైఫ్ ఇండియా, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, వైట్‌ఓక్ క్యాపిటల్, బ్లాక్‌రాక్ గ్లోబల్ ఫండ్స్, గోల్డ్‌మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ, కోటక్ మ్యూచువల్ ఫండ్ ఉన్నాయి.

కంపెనీ అధిక వాల్యుయేషన్ వెనుక బికాజీ చెబుతున్న కారణం ఏమిటంటే, దాని రాబడి, నికర లాభం, వృద్ధి దాని ప్రత్యర్థుల కంటే మెరుగ్గా ఉందని చెబుతోంది. గత రెండేళ్లలో కంపెనీ ఆదాయం, నికర లాభాల వృద్ధి (సీఏజీఆర్) వరుసగా 22 శాతం, 16 శాతంగా ఉంది. తమ బ్రాండ్ చాలా స్ట్రాంగ్ అని కూడా కంపెనీ చెబుతోంది. కంపెనీ దేశవ్యాప్తంగా ప్రెజెన్స్ ఉంది. అంతేకాదు అంతర్జాతీయంగా కూడా bikaji foods బ్రాండ్ విస్తరించింది. 

దాదాపు 250 రకాల చిన్న తిండ్లను ఈ  కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.  1993లో ప్రారంభించిన ఈ కంపెనీ, భారతదేశంలోని 22 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంకా, ఇది ఉత్తర అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ ప్రాంతంతో సహా 35 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది.

"కంపెనీ నిర్వహించే ఆహార మార్కెట్‌లో అసంఘటిత రంగానికి చెందిన వ్యాపారులే ఆధిపత్యం చెలాయిస్తున్నారు" అని బ్రోకరేజ్ సంస్థ ఛాయిస్ బ్రోకింగ్ విశ్లేషకుడు రాజ్‌నాథ్ యాదవ్ అన్నారు. అధిక వాల్యుయేషన్‌లు ఉన్నప్పటికీ బికాజీ తక్కువ ఆపరేటింగ్ మార్జిన్‌కి కారణం కావచ్చు. బికాజీ లాభాలను నిలబెట్టుకోవడంపై మాకు నమ్మకం లేదు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా లాభాలు తగ్గే ప్రమాదం ఉంది. కనుక జాగ్రత్తగా ఇష్యూకి సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నామని రాజ్ నాథ్ యాదవ్ తెలిపారు. 

బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు బికాజీ ఇష్యూ చాలా ఖరీదైనదిగా కనిపిస్తోంది. అయితే, ఇష్యూలో పెట్టుబడి పెట్టాలని విశ్లేషకులు సలహా ఇచ్చారు. ఎక్కువ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు ఈ ఇష్యూలో స్వల్ప కాలానికి ఇన్వెస్ట్ చేయవచ్చని చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్