
EPF Interest Rate: EPFO వడ్డీ రేటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం నేపథ్యంలో EPFO వడ్డీ రేటుపై కేంద్ర ప్రభుత్వం కత్తెర వేసింది. 2021-22 సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) కోసం 8.1 శాతం వడ్డీ రేటును ప్రభుత్వం ఆమోదించింది. ఇది 4 దశాబ్దాలలో కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఇది ఐదు కోట్ల ఈపీఎఫ్‌ఓ చందాదారులపై ప్రభావం చూపుతుంది.
EPFO వడ్డీ రేటు ఎంత తగ్గింది
మార్చిలో, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతం నుండి 8.1 శాతానికి తగ్గించాలని నిర్ణయించగా, ఇప్పుడు దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం.. వాస్తవానికి, శుక్రవారం జారీ చేసిన EPFO కార్యాలయం యొక్క ఉత్తర్వు ప్రకారం, EPF పథకంలోని ప్రతి సభ్యునికి 2021-22 సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ రేటును క్రెడిట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
కార్మిక మంత్రిత్వ శాఖ సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపింది. ప్రభుత్వ ఆమోదం తర్వాత, EPFO ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్థిర వడ్డీ రేటును ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభిస్తుంది. 8.1 శాతం EPF వడ్డీ రేటు 1977-78 తర్వాత అతి తక్కువ. అప్పట్లో ఇది 8 శాతంగా ఉంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) మార్చి 2021లో 2020-21కి EPF డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2021లో ఆమోదం తెలిపింది. దీని తరువాత, EPFO 2020-21కి 8.5 శాతం వడ్డీ ఆదాయాన్ని కస్టమర్ల ఖాతాలో జమ చేయాలని ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న EPFO ట్రస్టీ, KE రఘునాథన్ మాట్లాడుతూ కార్మిక, ఆర్థిక మంత్రిత్వ శాఖలు వడ్డీ రేటును ఆమోదించిన వేగం నిజంగా ప్రశంసనీయం. ఉద్యోగులకు చాలా డబ్బు అవసరం ఉంది. ఇది వారి పిల్లల విద్యా అవసరాల వంటి ఖర్చులను తీర్చడంలో వారికి సహాయపడుతుందని పేర్కొన్నారు.
వడ్డీ రేటు 44 సంవత్సరాల కనిష్టానికి
2021-22 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు 8.1 శాతం, ఇది 1977-78 తర్వాత అతి తక్కువ. 1977-78లో ఈ రేటు 8 శాతం. కొన్ని ఆర్థిక సంవత్సరాల్లో EPF డిపాజిట్లపై వడ్డీ రేట్ల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి-
1977-78: 8%
2011-12: 8.25%
2012-13: 8.5%
2013-14: 8.75%
2014-15: 8.75%
2015-16: 8.8%
2016-17: 8.65%
2017-18: 8.55%
2018-19: 8.65%
2019-20: 8.5% (ఏడేళ్లలో అంటే 2012-13 తర్వాత ఇది అతి తక్కువ వడ్డీ రేటు.)
2020-21: 8.5%