
పెరుగుతున్న అవసరాల కారణంగా డబ్బు తక్షణ అవసరంగా మారుంది. ముఖ్యంగా ప్రస్తుతం ద్రవ్యోల్బణ కాలంలో రుణాలు తీసుకోవడం అత్యంత అవసరంగా మారింది. ఖర్చులు పెరుగుతన్న నేపథ్యంలో సడెన్ గా వచ్చే పెద్ద ఖర్చుల కోసం డబ్బు తప్పని సరి అవుతోంది. మరి అలాంటి సమయాల్లో ప్రైవేటు లెండర్ల కన్నా కూడా బ్యాంకుల వద్ద రుణాలు తీసుకోవడం సులభం, సురక్షితం. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు పొందడం సులభంగా మారింది, ఈ రోజుల్లో రుణాలు తీసుకునే ధోరణి చాలా పెరిగింది. ముఖ్యంగా వ్యక్తిగత రుణం, గృహ రుణం, వాహన రుణంతో సహా వివిధ రకాల రుణాలను బ్యాంకుల నుండి తీసుకోవచ్చు. అన్ని రకాల లోన్‌లలో, పర్సనల్ లోన్ ట్రెండ్ ఎక్కువగా ఉంది. వ్యక్తిగత రుణాలను సులభంగా మరియు త్వరగా పొందడమే దీనికి కారణం. దీని కోసం మనం బ్యాంకులో ఏదీ కూడా తనఖా పెట్టాల్సిన అవసరం లేదు.
బ్యాంకులు ఇచ్చే ఇతర రుణాల కంటే పర్సనల్ లోన్ వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత రుణం ఇవ్వడానికి ప్రతి బ్యాంకుకు దాని స్వంత నియమాలు ఉంటాయి. అలాగే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ రోజు మేము మీకు ఏ బ్యాంకుల వ్యక్తిగత రుణాలకు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారో తెలుసుకుందాం.
బ్యాంకు >> వడ్డీ రేటు
Indian Bank >> 8.50-9 %
Union Bank of India >> 9.30-13.40 %
Bank of Maharashtra >> 9.45-12.80%
IDBI >> 9.50-14%
Punjab & Sind Bank >> 9.50-11.50%
State Bank of India >> 9.60-13.85%
Central Bank of India >> 9.85-10.05%
PNB >> 9.90-14.45%
Indian Overseas Bank >> 10-11%
HDFC Bank >> 10.25-21%
బ్యాంకు నుండి సమాచారం పొందండి
మేము మీకు ఇక్కడ ఇస్తున్న సమాచారం ఏప్రిల్ 21, 2022 వరకు బ్యాంకుల వెబ్‌సైట్‌ల నుండి సేకరించారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, క్రెడిట్ ప్రొఫైల్, లోన్ మొత్తం, లోన్ కాలవ్యవధి మీరు పనిచేసే కంపెనీని బట్టి వడ్డీ రేట్లు మారవచ్చు. కాబట్టి, పర్సనల్ లోన్ కోసం అప్లై చేసే ముందు, బ్యాంకు నుండి వడ్డీ రేటు మొదలైన వాటి గురించి సమాచారాన్ని పొందడం చాలా ముఖ్యం.