97 శాతం మొబైల్ ఉత్పత్తులు భారత్‌లోనే తయారు, Invest Karnataka సదస్సులో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడి

Published : Nov 02, 2022, 04:49 PM IST
97 శాతం మొబైల్ ఉత్పత్తులు భారత్‌లోనే తయారు, Invest Karnataka సదస్సులో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడి

సారాంశం

ఇన్వెస్ట్ కర్ణాటక సదస్సులో కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలుస్తుందని  ఆశాభావం వ్యక్తం చేశారు.  అంతేకాదు ఇప్పటికే స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడటం లేదని పేర్కొన్నారు   

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో మూడు రోజుల ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. టెక్నాలజీ రంగంలో కర్ణాటక, బెంగళూరు అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సదస్సులో మాట్లాడిన కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, కోవిడ్‌ కాలంలో కర్ణాటక ప్రభుత్వం చేసిన కృషిని ప్రశంసించారు. 

బెంగళూరు ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరం. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు ప్రపంచంలోని వ్యాపారవేత్తలందరికీ స్వాగతం పలుకుతున్నామని, కోవిడ్ సమయంలో కర్ణాటక ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసిందని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ప్రస్తుతం కష్టపడి పనిచేస్తున్న సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో కర్ణాటకలో మంచి భవిష్యత్తుతో. నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ను అగ్రగామిగా నిలిచేందుకు దోహదపడుతుందోని అన్నారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. 

కర్ణాటకలో ఐటీ రంగం వచ్చి 25 ఏళ్లు పూర్తయ్యాయి. దేశంలో సాంకేతికతతో పాటు, ఎలక్ట్రానిక్, సెమీకండక్టర్ పరిశ్రమ కూడా గొప్ప రేటుతో అభివృద్ధి చెందుతోంది. 2014లో మేము విదేశాల నుండి అన్ని మొబైల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాము. కానీ, ఇప్పుడు 97 శాతం మొబైల్ ఉత్పత్తులు భారతదేశంలోనే తయారవుతున్నాయి. ఇది నిజంగా గర్వించదగ్గ విషయమని కేంద్ర ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ల సమావేశానికి తొలిరోజు బంపర్ ఇన్వెస్ట్‌మెంట్. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రాబోయే సంవత్సరాల్లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ ప్రకటించారు. మరోవైపు, రాష్ట్రంలో 50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు స్టీర్‌లైట్ పవర్ సీఈవో ప్రతీక్ అగర్వాల్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఇంధన రంగంలో పెట్టుబడిగా పెట్టనున్నామని, గ్రీన్ ఎనర్జీ (ఇన్వెస్ట్ కర్ణాటక 2022) పరిశోధనలో పెట్టుబడులు పెట్టబోతున్నామని చెప్పారు.

తొలిరోజే రూ.3.61 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియం, సోలార్ ఎనర్జీ సెక్టార్, సెమీ కండక్టర్ సెక్టార్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో మొదటి రోజు పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. 

ఇదిలా ఉంటే మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. పారిశ్రామిక రంగంలో కొత్త విప్లవం సృష్టించాలనే ఆశయంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ఈసారి 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి మురుగేష్ నిరాణి అన్నారు. బిల్డ్ ఫర్ ద వరల్డ్ అనే థీమ్‌తో మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. ఇన్వెస్ట్ కర్ణాటక 2022 గ్లోబల్ సమ్మిట్‌లో 50కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, జపాన్‌తో సహా భాగస్వామ్య దేశాలు పాల్గొంటాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్