టాప్ 10 సేఫ్ కార్స్ : మీ కారు ఎంత సురక్షితమైనది..? ఇండియాలోని 10 సురక్షితమైన కార్లు ఇవే..

By asianet news telugu  |  First Published Sep 7, 2022, 4:24 PM IST

రోడ్డు ప్రమాదంలో సైరస్ మీస్త్రి మరణించడంతో కార్ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీరు ప్రయాణించే కారు ఎంత సురక్షితమైనది ? గ్లోబల్ ఎన్‌సి‌ఏ‌పి క్రాష్ టెస్ట్ రేటింగ్ తాజాగా భారతీయ కార్ల భద్రత రేటింగులను విడుదల చేసింది. 


టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ గత ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కార్ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీరు ప్రయాణించే కారు ఎంత సురక్షితమైనది ? గ్లోబల్ ఎన్‌సి‌ఏ‌పి క్రాష్ టెస్ట్ రేటింగ్ తాజాగా భారతీయ కార్ల భద్రత రేటింగులను విడుదల చేసింది.  అయితే టాప్ 10 సురక్షితమైన కార్ల లిస్ట్ మీకోసం...

గ్లోబల్ ఎన్‌సి‌ఏ‌పి జూన్ 2022లో భారత మార్కెట్లోని టాప్ 10 సురక్షితమైన కార్ల లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు కార్ల తయారీ సంస్థలు టాప్ 10 లిస్ట్ లోని 10 స్థానాల్లో 7 స్థానాలను ఆక్రమించుకుంది. హోండా, టయోటా ఇంకా వోక్స్‌వ్యాగన్ ఇతర మూడు స్థానాల్లో చోటు  దక్కించుకున్నాయి. భారతదేశంలోని 10 సురక్షితమైన కార్ల గురించి మీకోసం...

Latest Videos

undefined

టాప్ 5 సురక్షితమైన కార్లు
టాప్ 10 సురక్షిత కార్ల లిస్ట్ లో మొదటి ఐదు కార్లు ఫుల్ 5-స్టార్ రేటింగ్‌ పొందాయి. ఇందులో టాటా పంచ్, మహీంద్రా ఎక్స్‌యూ‌వి300, టాటా ఆల్ట్రోజ్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూ‌వి700 ఉన్నాయి. అంటే, భారతదేశంలో విక్రయించే టాప్ 5 సురక్షితమైన కార్లు టాటా మోటార్స్ ఇంకా మహీంద్రా కంపెనీలవే. ఈ కార్లు 5-స్టార్ రేటింగ్‌తో వస్తున్నాయి. 

6 నుండి 10 వరకు ర్యాంక్
టాప్ 10 సురక్షిత కార్లలోని మిగతా  ఐదు స్థానాల్లో 4-స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఉన్నాయి. ఈ లిస్ట్ లో హోండా జాజ్, టయోటా అర్బన్ క్రూయిజర్, మహీంద్రా మరాజో, వోక్స్‌వ్యాగన్ పోలో, మహీంద్రా థార్  ఉన్నాయి. 

ఈ 5 కార్లు పిల్లలకు అత్యంత సురక్షితమైనవి
 పిల్లల భద్రత పరంగా సురక్షితమైన కార్ల గురించి మాట్లాడితే మహీంద్రా ఎక్స్‌యూ‌వి700 అత్యధిక స్కోర్‌ పొందింది. తర్వాత మహీంద్రా థార్, టాటా పంచ్, ఎక్స్‌యూ‌వి300, టయోటా అర్బన్ క్రూయిజర్ ఉన్నాయి. అయితే మారుతి బ్రెజ్జా ఈ లిస్ట్ లో 13వ స్థానంలో నిలిచింది. 
 

click me!