రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బైక్ కొనాలనుకునే వారికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా నిలిచే టాప్ 5 బైక్‌ల గురించి తెలుసుకోండి. ఇవి స్టయిల్ కి స్టయిల్ లుకింగ్ లో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ లుక్ అందిస్తుంది.
భారతదేశంతో సహా వివిధ దేశాల్లో క్లాసిక్ బైక్‌లు ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులారిటీ పొందాయి. ప్రస్తుతం, కొన్ని ఇతర బైక్స్ తయారీదారులు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నారు. మీరు ఈ బైక్‌లలో క్లాసిక్ అండ్ రెట్రో డిజైన్‌ను కూడా పొందుతారు.
జావా, యేజ్డి, హోండా వంటి కంపెనీలు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లకు పోటీగా ఎన్నో బైక్‌లను విడుదల చేశాయి. పవర్ ఫుల్ ఇంజన్లు, గొప్ప ఫీచర్లతో ఈ బైక్‌లు మీకు మంచి అప్షన్ గా ఉంటాయి. భారతీయుల కోసం బడ్జెట్ బైక్‌ను విడుదల చేసేందుకు హార్లే డేవిడ్‌సన్ ఈ ఏడాది హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
undefined
హోండా CB350 : హోండా రెట్రో క్లాసిక్ లుక్ CB350 రాయల్ ఎన్‌ఫీల్డ్ బెస్ట్ పోటీదారులలో ఒకటి. దీని డిజైన్ ఇంకా స్టయిల్ చాలా బాగుంటుంది. ఈ బైక్ 348.36సీసీ ఇంజన్‌తో వస్తుంది. భారతదేశంలో హోండా CB 350 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
హార్లే డేవిడ్‌సన్ X440 : హార్లే డేవిడ్‌సన్ X440 బైక్‌ను భారతీయ వినియోగదారుల కోసం చాలా బడ్జెట్ ధరలో విడుదల చేసింది. 440సీసీ ఇంజిన్‌తో ఈ లిస్టులో అత్యంత శక్తివంతమైన బైక్ ఇదే. స్టైలిష్ హార్లే బ్రాండ్ బైక్ ధర రూ.2.39 లక్షలు ఎక్స్-షోరూమ్.
జావా 42 : మహీంద్రా & మహీంద్రా ఆధ్వర్యంలోని జావా మోటార్‌సైకిల్ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీదారి. మీరు జావా 42 కొనుగోలు కూడా చేయవచ్చు. ఈ ఏబైక్ 294.72సీసీ ఇంజన్‌తో వస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
యెజ్డీ రోడ్‌స్టర్: మహీంద్రా యెజ్డీ రోడ్‌స్టర్ ఈ విభాగంలో గొప్ప అప్షన్. Yezdi Roadster 334cc పవర్ ఇంజన్‌తో వస్తుంది. భారతీయ రోడ్లపై ప్రధానమైన యెజ్డీ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ. 2.08 లక్షలు.
బెనెల్లీ ఇంపీరియాలే 400 : బెనెల్లీ ఇంపీరియల్ 400 ఒక క్లాసిక్ మోటార్‌సైకిల్ శక్తివంతమైన బైక్. డిజైన్ అండ్ స్టయిల్ కి ఈ బైక్ మీకు మంచి అప్షన్. ఈ బైకులో 374 సీసీ ఇంజన్ ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.35 లక్షలు.