ఆటోమొబైల్ సంస్థలకు తీపి గుర్తులు

By Sandra Ashok Kumar  |  First Published Oct 29, 2019, 11:28 AM IST

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దంతేరాస్ పర్వదినం ఆటోమొబైల్ సంస్థలకు తీపి గుర్తులే మిగిల్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా 13,500, మారుతి సుజుకి 45 వేలు, హ్యుండాయ్ 12,500 కార్లు వినియోగదారులకు పంపిణీ చేశాయి. అంటే ఆటోమొబైల్ రంగానికి మంచిరోజులు వచ్చేశాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
 


న్యూఢిల్లీ:ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల అమ్మకాలు బాగా పడిపోయాయని ఆటో మొబైల్‌‌ కంపెనీలన్నీ లబోదిబోమని మొత్తుకుంటున్నాయి. కానీ మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుండాయ్ మోటార్స్,  మారుతి సుజుకి, లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెజ్‌‌ బెంజ్‌‌ మాత్రం ఖుషీగా ఉన్నాయని చెప్పొచ్చు. 

వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆటోమొబైల్ సంస్థలు కార్లు, మోటారు సైకిళ్లు, స్కూటర్లు డిజైన్ చేసి అందుబాటులోకి తెస్తే సేల్స్ బాగానే ఉంటాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మహీంద్రా అండ్ మహేంద్రా సంస్థ కేవలం దంతేరాస్ రోజే 13,500 కార్లను డెలివరీ చేసింది. పలు ఆటోమొబైల్ సంస్థలు భారీగా వాహనాలు వినియోగదారులకు అందజేశాయి. 

Latest Videos

also read 2020లో రాబోతున్న డుకాటీ స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్

గతేడాది దంతేరాస్ పండుగతో పోలిస్తే ఈ ఏడాది డెలివరీ చేసిన కార్ల సంఖ్య చాలా ఎక్కువే. దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ మోటార్స్ 12, 500 కార్లు, మారుతి సుజుకి 45 వేల కార్లను డెలివరీ చేసింది. 

మరోవైపు బెంజ్‌‌ ధంతేరాస్‌‌ నాడు ఏకంగా 600 లగ్జరీ కార్లు అమ్మిది. వీటిలో సగం ఢిల్లీ నుంచే అమ్ముడయ్యాయి. మిగతా వాటిని పంజాబ్‌‌, ముంబై, పుణే, కోల్‌‌కతా, గుజరాత్‌‌వాసులు కొన్నారని కంపెనీ తెలిపింది. 

‘‘ఈసారి పండగ సీజన్‌‌ మాకు ఎంతో సంతోషం కలిగించింది. అన్ని రాష్ట్రాల మార్కెట్లలో మా కార్లు బాగా అమ్ముడయ్యాయి. జీఎల్‌‌ఈ సిరీస్‌‌ వెహికిల్స్‌‌కు అద్భుతమైన స్పందన కనిపించింది. మూడు నెలల ముందుగానే మా టార్గెట్‌‌ను చేరుకున్నాం’’ అని మెర్సిడెజ్ బెంజ్‌‌ ఇండియా సీఈఓ, ఎండీ మార్టిన్‌‌ ష్వీంక్‌‌ అన్నారు. 

also read లంబోర్ఘిని నుంచి రేస్-రెడీ లంబోర్ఘిని ఉరుస్ ST-X

కస్టమర్లకు తమపై నమ్మకం పెరుగుతున్నదనడానికి ఈ అమ్మకాలే నిదర్శనమని మెర్సిడెజ్ బెంజ్‌‌ ఇండియా సీఈఓ, ఎండీ మార్టిన్‌‌ ష్వీంక్‌ చెప్పారు. దసరా సీజన్‌‌లోనూ బెంచ్‌‌ ముంబై, గుజరాత్‌‌లో 200 కార్లను విక్రయించింది. 

తదనంతరం జీఎల్‌‌ఈ ఎస్‌‌యూవీలకు బుకింగ్స్‌‌ మొదలుపెట్టింది. కొన్ని రోజుల్లోనే మొత్తం అమ్ముడవడంతో ‘నో స్టాక్‌‌’ బోర్డు పెట్టింది. వచ్చే ఏడాది జీఎల్‌‌ఈ కొత్త వెర్షన్‌‌ను అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ తెలిపింది. ఇంకా ఎంజీ మోటార్స్ 700 కార్లను డెలివరీ చేసింది.
 

click me!