దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ క్రెటా కంపాక్ట్ ఎస్‌యూవీని ఆధునీకరించి కన్వర్టబుల్ ఎస్‌యూవీగా రూపొందిస్తున్నారు. ఇది చూడటానికి లెగిట్ మోడల్ కారు మాదిరిగా ఉంటుంది. తదనుగుణంగా డిజైనర్ కూడా వైండ్ షీల్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడంతోపాటు రూప్, సీ- పిల్లర్ తొలగించారు.
భారతదేశం ఎల్లవేళలా ఓపెన్ టాప్ కన్వర్టబుల్ కార్లకు సిద్ధం కాదు. కానీ చాలా మందిలో మాత్రం ఓపెన్ టాప్ కారులో శిరోజాలు అలా ఎగిరిపడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్లాలనిపిస్తుంది. కఠిన వాతావరణ పరిస్థితుల, అధిక ధరల కారణంగా కన్వర్టబుల్ కార్లను కొనుగోలుచేయడానికి భారత్ వంటి దేశాల్లో వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపించరు.
కానీ హ్యుండాయ్ క్రెటా కన్వర్టిబుల్ కారును ఎస్ఆర్కే డిజైన్స్ రూపొందించింది. దీన్నికొనుగోలు చేయడానికి వినియోగదారులను డిజైన్ ఒకటికి రెండుసార్లు ఆలోచింప చేస్తుంది. భారతదేశ మార్కెట్లో హ్యుండాయ్ సక్సెస్ అయిన మోడల్ క్రెట్టా ఎస్ యూవీ మాత్రమే.
విదేశాల్లోనూ వినియోగ యోగ్యమైన ఎస్‌యూవీ కారుగా ఇది పేరుతెచ్చుకున్నది. తాజాగా కన్వర్టబుల్ రెండరింగ్ మోడల్ కారు రియల్ లైఫ్ మోడల్ కానున్నది. అందరి దృష్టిని ఆకర్షించడం ఈ కారు స్పెషాలిటీ.
కార్ల వినియోగదారులను ఆకర్షించే విధంగా డిజైనర్ కూడా వైండ్ షీల్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడంతోపాటు రూప్, సీ- పిల్లర్ తొలగించారు. మరోవైపు ఇండికేటర్ సెటప్, స్లీక్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ వరకు హ్యుండాయ్ క్రెట్టా కన్వర్టిబుల్ గ్రిల్లేను విస్తరించారు. ఇది కార్ల మోడళ్లలో న్యూ ఫ్రంట్ ఫ్యాషియా డిజైన్‌ను తలపిస్తుంది.
ఇక డీఆర్ఎల్ సెటప్‌నకు దిగువన కారు మెయిన్ హెడ్ ల్యాంప్ సెటప్‌ను అమర్చారు. అలా చూస్తే శాంటా ఫీ ఎస్‌యూవీ కారును తలపిస్తుంది. అల్లాయ్ వీల్స్ బోల్డర్ స్టాన్స్‌తో అమర్చారు.
ఇక కారును అమర్చే నాలుగు డోర్లు కుటుంబ సభ్యులందరు వినియోగించుకునేందుకు వీలుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇటీవల టాటా మార్కెట్లోకి ఆవిష్కరించిన టాటా హారియర్ ఎవోక్యూ కన్వర్టిబుల్ మోడల్ కారును సరిపోలి ఉంటుంది.