అత్యంత నిరుత్సాహకరమైన విషయం ఏమిటంటే, సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ ఎస్‌యూవి కార్ చాలా సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఈ కంపెనీ కార్లు ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి.
వ్యాపార దిగ్గజం సైరస్ మిస్త్రీ నిన్న ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ముంబై సమీపంలోని పాల్ఘర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వేగంగా ప్రయాణిస్తున్న వీరి ఎస్‌యూవీ కార్ డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదంలో మృతి చెందాడు. అత్యంత నిరుత్సాహకరమైన విషయం ఏమిటంటే, సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ ఎస్‌యూవి కార్ చాలా సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఈ కంపెనీ కార్లు ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. ఎన్నో సేఫ్టీ ఫీచర్లతో కూడిన మెర్సిడెస్ ఎస్‌యూవీలో ప్రయాణించిన తర్వాత కూడా మృత్యువు ముందు ప్రాణం పోతే అందుకు నివారణలు, కారణాలు ఏంటి...
మెర్సిడెస్ జిఎల్‌సి సిరీస్ ఎస్‌యూవి
మెర్సిడెస్ ఎస్‌యూవి ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న ఎస్‌యూవి మెర్సిడెస్ జిఎల్‌సి 220d 4మ్యాటిక్ ఎస్‌యూవి. ఈ కంపెనీ ఎస్‌యూవి కార్ ప్రీ-సేఫ్ సిస్టమ్‌తో వస్తుంది. దీనితో పాటు పార్క్‌ట్రానిక్‌తో యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా వ్యూ, మోకాలి సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ కార్ ఓవర్ స్పీడింగ్ వార్నింగ్ సిస్టమ్‌తో వస్తుంది, ఇంకా ఈ ఎస్‌యూవి 80 kmph స్పీడ్ లో బీప్ చేస్తుంది, 120 kmph కంటే ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు బీప్ సౌండ్ నిరంతరం చేస్తుంది, అంటే డ్రైవర్ కి కార్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉందని హెచ్చరిస్తుంది, అలాగే స్పీడ్ తగ్గించాల్సిన అవసరం ఉందని చెబుతుంది. ఈ ఎస్‌యూవి డ్రైవర్ ఇంకా ప్రయాణీకుల కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఈ కారు యూరో NCAP నుండి 5-స్టార్ రేటింగ్‌ను కూడా పొందింది.
undefined
కార్ ఇంజిన్
మెర్సిడెస్ నుండి ఈ ఎస్‌యూవి డీజిల్ వెర్షన్ 1950cc 4-ఇన్‌లైన్ సిలిండర్ ఇంజన్, 192 bhp ఆండ్ 400 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 7.9 సెకన్లలో గంటకు సున్నా నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకోగలదు. ఈ కార్ టాప్ స్పీడ్ 215kmph. అలాగే 9 గేర్డ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. దీనికి ముందు ఇంకా వెనుక డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు. కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.68 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
ఆనంద్ మహీంద్రా ట్వీట్
అయితే సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు అతివేగంగా ప్రయాణించడంతో పాటు ప్రమాద సమయంలో వెనుక కూర్చున్న సైరస్ మిస్త్రీ సీటు బెల్టు ధరించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో ట్వీట్ చేశారు.
కారులో వెనుక సీట్లో కూర్చున్నా సరే మీరందరూ ఎల్లప్పుడూ సీటు బెల్టు ధరించాలని ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుతున్నా. ఎందుకంటే మనం మన కుటుంబాలకు ఎంతగానో రుణపడి ఉన్నాం అంటూ ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో సైరస్ మిస్త్రీతో సహా మరొకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అతివేగంతో పాటు ‘డ్రైవర్ తప్పుడు నిర్ణయమే’ ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. వీరి కారు కేవలం 9 నిమిషాల్లోనే 20 కిలోమీటర్లు ప్రయాణించినట్లు కూడా పోలీసులు గుర్తించారు.