విపణిలో క్వార్టర్‌కో ‘ఆడీ’ కారు...

By Sandra Ashok KumarFirst Published Oct 28, 2019, 11:21 AM IST
Highlights

2020 నుంచి ప్రతి త్రైమాసికానికి ఒక నూతన మోడల్ కారును విపణిలోకి విడుదల చేస్తామని జర్మనీ కార్ల తయారీ సంస్థ ‘ఆడీ’ పేర్కొంది.

న్యూఢిల్లీ: ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ భారతదేశంలోని ప్రీమియం ఆటోమొబైల్ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది. న్యూఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), ముంబై వంటి మెట్రో పాలిటన్ సిటీస్ కంటే చిన్న పట్టణాల్లో పాగా వేయడంపై కేంద్రీకరించింది ఆడి. 

ఈ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 2020 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి త్రైమాసికంలో ఒక నూతన మోడల్ కారును వినియోగదారుల ముంగిట ఆవిష్కరించేందుకు వ్యూహాన్ని ఖరారు చేసింది ఆడి. 2015 నుంచి భారత దేశ మార్కెట్లో పాగా వేయాలని రూపొందించిన వ్యూహాన్ని అమలు చేసే దిశగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.

also read 2030కల్లా డ్రైవర్‌లెస్ ‘ఎమిరాయ్ ఎస్’ కార్లు 

ఎనిమిదో తరం సెడాన్ ‘ఎ6’ కారు ఆవిష్కరణ సందర్భంగా ఆడి ఇండియా చీఫ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్ పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తద్వారా లగ్జరీ కార్ల సెగ్మెంట్‌కు కొంత ఎల్బో రూం వంటి ఆఫర్ లభిస్తుందని పేర్కొన్నారు. 2016లో మెర్సిడెజ్ బెంజ్ కారుకు ఆధిపత్య స్థానం అప్పగించింది. భారత లగ్జరీ కార్ల మార్కెట్లో రెండో స్థానంలో జర్మనీ మేజర్ బీఎండబ్ల్యూ నిలిచింది. 

2025 నాటికి పూర్తిస్థాయిలో వినియోగదారుల దరికి చేరువవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది ఆడి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి త్రైమాసికానికి ఒక నూతన మోడల్ కారును విపణిలోకి విడుదల చేస్తామని ఆడి ఇండియా చీఫ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ చెప్పారు. 

also read ఇండియాలోకి న్యూ జనరేషన్ ఆడి ఎ6: ధర 54.20 లక్షలు

‘మేం ఆశావాదులం, కానీ ఆచితూచి జాగ్ర్తత్తగా ముందుకు వెళతాం’ అని ఆడి ఇండియా చీఫ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ చెప్పారు. 2020 నుంచి బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన కార్ల మార్కెట్ మరింత కఠినంగా ఉంటుంది. ప్రస్తుత అనిశ్చితి ఒక స్థాయికి వెళ్లే వరకు కొనసాగుతూ ఉంటుంది’ అని చెప్పారు.

ఆటోమొబైల్ రంగంపై అత్యధిక జీఎస్టీ రేట్లు వసూలు చేయడంతో ఏటా 30 లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యే భారత మార్కెట్లో ప్రీమియం కార్ల వాటా 1.2 శాతమేనని ధిల్లాన్ తెలిపారు. ఒకవేళ పన్ను రేట్లు తగ్గిస్తే ప్రీమియం కార్ల విభాగం విస్తరణకు వెసులుబాటు లభిస్తుందని చెప్పారు.  కొన్నేళ్ల క్రితం ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై నగరాల్లో 50 శాతం విక్రయాలు సాగితే ప్రస్తుతం 35 శాతానికి ఆడి కార్లు పడిపోయాయి. దీంతో చిన్న పట్టణాల్లోని మార్కెట్లపై ఆడీ కారు కేంద్రీకరించింది. 

click me!