గింజలు తినడం వల్ల మన శరీరానికి విటమిన్ బీ తో సహా అనేక పోషకాలు లభిస్తాయి. విటమిన్ బీ మన శరీరంలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
అవకాడో మెదడును శాంతపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఒమేగా-3 డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
నల్ల ద్రాక్ష మన మెదడుకు చాలా మంచిది. నల్ల ద్రాక్షతో పాటు బ్లూబెర్రీస్ కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరల ద్వారా మీ శరీరానికి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ కూరగాయలు తింటే, మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.