వాస్తవానికి ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ డి ఉండదు. కానీ, కొన్ని రకాల ఆరెంజ్ జ్యూస్ విటమిన్ డి తో బలోపేతం చేయబడతాయి. ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ ద్వారా విటమిన్ డి ని పొందవచ్చు.
గుడ్డు పచ్చసొన (egg yolk) నుండి విటమిన్ డి లభిస్తుంది. ఒక గుడ్డు పచ్చసొనలో రోజువారికీ అవసరమయ్యే సుమారు 7% విటమిన్ డి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తి, ఎముకలను బలోపేతం చేస్తుంది.
పుట్టగొడుగులలో విటమిన్ డి అధికం. అయితే వీటికి సూర్యరశ్మి తాకకుంటే విటమిన్ డి ఉండదు. ఇందులోని ఎర్గోస్టెరాల్ అనే ఒక పదార్థం అతినీలలోహిత కాంతికి గురైనప్పుడు విటమిన్ డి గా మారుతుంది.
సాల్మన్ చేపలలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యం, కండరాల పనితీరు, రోగనిరోధక శక్తికి అవసరం.
పెరుగు నుండి విటమిన్ డి లభిస్తుంది.
చీజ్‌లో కూడా విటమిన్ డి ఉంటుంది. ముఖ్యంగా స్విస్ చీజ్, చెడ్డార్ చీజ్‌లలో ఎక్కువ విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి ఎముకలు, కండరాలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.
పుట్టగొడుగులు విటమిన్ డి మంచి మూలంగా పరిగణించబడే ఆహారం. కాబట్టి వర్షాకాలంలో పుట్టగొడుగులను కూడా తినవచ్చు. అలాగే.. పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా విటమిన్ డికి అద్భుతమైన మూలం.