మారేడు పండు జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కడుపులో మంట, గ్యాస్, అసిడిటీని తగ్గిస్తుంది. ఇది సహజంగా చల్లదనాన్నిస్తుంది.
మారేడు జ్యూస్ లో సహజ ఫైబర్, లాక్సేటివ్ గుణాలు ఉంటాయి, ఇవి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
వేసవిలో మారేడు పండు జ్యూస్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది, ఎండ దెబ్బ తగలదు.
మారేడు జ్యూస్ లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మారేడు జ్యూస్ (చక్కెర లేకుండా తాగితే) రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ పేషంట్స్ కూడా పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు.
మారేడు జ్యూస్ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది, దీని వల్ల చర్మం శుభ్రంగా, కాంతివంతంగా ఉంటుంది. వేసవిలో చర్మ అలెర్జీలు, దద్దుర్ల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
వేసవిలో బలహీనత, అలసట సాధారణం. మారేడు జ్యూస్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది, హైడ్రేట్ గా ఉంచుతుంది.