Asianet News TeluguAsianet News Telugu

చిలిపి పిల్లి.. రంజాన్ ప్రార్థనలు చేస్తుంటే ఇమామ్ మీద దూకుతూ అల్లరి.. వైరల్

అల్జీరియాలోని ఓ మసీదులో ఓ చిలిపి పిల్లి చేష్టలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనల్లో అది చేసిన అల్లరి ఇది.

Cat Jumps On Imam While Ramadan Prayers In Algeria Video Goes Viral - bsb
Author
First Published Apr 6, 2023, 11:39 AM IST

అల్జీరియా : ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని పాటిస్తున్నారు. మాసాన్ని పురస్కరించుకుని, ముస్లింలు ప్రత్యేక తరావీహ్ ఆచారాలను ఆచరిస్తారు. ఈ క్రమంలోనే, అల్జీరియాలోని ఓ మసీదులో ఇమామ్ ప్రార్థనకు నాయకత్వం వహిస్తుండగా, ఓ పిల్లి అతనిపైకి దూకిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరి హృదయాలను గెలుచుకుంటుంది.

వైరల్ అవుతున్న వీడియో ఫేస్‌బుక్‌లో షేక్ వాలిద్ మెహసాస్ అధికారిక పేజీ ద్వారా షేర్ చేయబడింది. రెండు నిమిషాల నిడివి గల వీడియోలో, అల్జీరియాలోని బోర్డ్జ్ బౌ అరేరిడ్జ్‌లోని రద్దీగా ఉండే మసీదులో పవిత్ర రంజాన్ మాసంలో రాత్రిపూట జరిగే ప్రార్థన అయిన తరావీహ్‌కు ఇమామ్ ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ చిలిపి పిల్లి అక్కడికి వచ్చింది. ముందు అతని కాళ్లలో నుంచి వెడుతూ అల్లరి చేసిన ఆ పిల్లి... ఇమామ్ తనకు అటెన్షన్ ఇవ్వలేదనుకుందో ఏమో.. ఒక నిమిషం తరువాత, ఆ పిల్లి ఇమామ్‌పైకి దూకింది. అయితే, ఇమామ్ దానిని చూసి ఆశ్చర్యపోలేదు. 

నువ్వు కాల్ గర్ల్స్ కాదా? .. వేశ్య అనే ప్రచారంతో ఓ మహిళా జర్నలిస్టుకు వేధింపులు..

ఆ పిల్లి అతని పెంపుడు పిల్లి అయినా అయి ఉండాలి.. లేదా ఆ మసీదులోదైనా కావచ్చు. నమాజ్ చదువుతూనే దాన్ని గారం చేస్తారు. అది చివరికి అతని భుజానికి ఎక్కుతుంది. అతని ముఖాన్ని ముద్దు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఇమామ్ కళ్ళు మూసుకుని తన పఠనాన్ని కొనసాగిస్తాడు. ఆ తరువాత పిల్లి ఆయన భుజం నుండి దూకి ప్రాంగణం చుట్టూ తిరుగడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. 

సోషల్ మీడియాలో షేర్ చేయబడినప్పటి నుండి ఈ వీడియో 46,000 లైక్‌లు, 10,000 షేర్లు అయ్యింది. "జంతువులు కూడా దేవుని మాటలకు భయపడతాయి. పిల్లి ఇమామ్‌పైకి ఎక్కడం చూడండి. ఇమామ్ తరావీహ్ ప్రార్థనలో ఖురాన్ చదువుతున్నాడు" అని సదరు వ్యక్తి పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.

పిల్లి చిలిపి చేష్టలు చాలా అందంగా ఉన్నాయి.. అదిచూస్తుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.. అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. పిల్లి తన చెవులకు నచ్చే స్వరంలో నోబెల్ ఖురాన్ పఠించినందుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇమామ్ స్పందన అద్భుతంగా ఉంది.. కిట్టీని పట్టుకోవడం కూడా మిస్ చేయలేదు అని ఒకరు..  ఇది నవ్వుతెప్పించేలా ఉంది, అద్భుతంగా ఉంది. అతను తన ఏకాగ్రతను ఎలా కాపాడుకున్నాడో చూడండి.. అది నాకు భలే నచ్చింది. పిల్లిని కూడా ఇష్టపడుతున్నాను.. అని మరొకరు కామెంట్ చేశాడు. 

ఈ వీడియో హృదయాన్ని కదిలించేలా ఉంది... అని ఒకరంటే.. ఇమామ్ రూంలోకి వెళ్లబోతున్నప్పుడు పిల్లి ఎలా కిందికి దూకుతుందో నాకు చాలా ఇష్టంగా అనిపించింది అని మరో వ్యక్తి అన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios