Asianet News TeluguAsianet News Telugu

ఆ పథకానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు...: కేసీఆర్

తెలంగాణలో నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేశారు.అందులో కొన్ని పథకాలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు. ముఖ్యంగా రైతుల కోసం చేపట్టిన రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందని కేసీఆర్ తెలిపారు.  

trs praja ashirvadha sabha at palakurthy
Author
Palakurthy, First Published Nov 19, 2018, 5:59 PM IST

తెలంగాణలో నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేశారు.అందులో కొన్ని పథకాలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు. ముఖ్యంగా రైతుల కోసం చేపట్టిన రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందని కేసీఆర్ తెలిపారు.  

ఎన్నికల ప్రచారంలో భాగంలో ఇవాళ వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు వచ్చిన ప్రజలను చూస్తేనే దయాకరరావు గెలుపు ఖాయంగా కనిపిస్తోంది...కానీ గెలుపు మాత్రమే చాలదని భారీ మెజారిటీతో ఆయన్ను అసెంబ్లీకి పంపించాలని కేసీఆర్ సూచించారు. దయాకర్ చాలా హుషారైన మనిషే కాదు మంచి ఎమ్మెల్యే కూడా అంటూ కేసీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. 

దేవాదుల ప్రాజెక్టు ద్వారా కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాకే 100టీఎంసీల నీళ్లు రాబోతున్నాయని కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి గ్రామాల్లోని ప్రజలందరు గుర్తించారన్నారు. కళ్యాణ లక్ష్మీ వంటి పథకం వరంగల్ జిల్లా ములుగు మండలంలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిందని కేసీఆర్ గుర్తు చేశారు.  ఇలా అనేక పథకాలు వరంగల్ జిల్లా నుండే ప్రారంభమమయ్యాయని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ సభకు ఇంత భారీ ఎత్తును ప్రజలు రావడమే దయాకరరావు గెలుపును సూచిస్తోందన్నారు. అయితే ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి వున్నా సమయం లేదు కాబట్టి మాట్లాడలేక పోతున్నానని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. 

మరిన్ని వార్తలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios