Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో భానుడి భగభగ.. ఐదు రోజులు మండిపోనున్న ఎండలు

తెలంగాణలో రాగల ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో మూడు డిగ్రీల సెల్సియస్‌లు పెరగనున్నట్టు ఐఎండీ అంచనా వేసింది. జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది.
 

temperature to increase more 3 degrees in telangana kms
Author
First Published Mar 24, 2024, 10:55 PM IST

Heat Wave: ఎండాకాలం మొదలు కాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మార్చి నెలలోనే ఎండలు పీక్స్‌కు వెళ్లాయి. మధ్యలో రెండు మూడు రోజులు వర్షాలు పడినా.. వెంటనే భానుడు తేరుకున్నాడు. తనదైన శైలిలో నిప్పులు కురిపిస్తున్నాడు. మార్చి నెలలోనే ఇలా ఉంటే.. మే నెల పరిస్థితి ఏమిటా? అనే టెన్షన్ మొదలైంది. 

ఇప్పటికే చురుక్కుమనిపిస్తున్న సూర్యుడు వచ్చే ఐదు రోజులు తెలంగాణలో దంచికొట్టనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరో 3  డిగ్రీల సెల్సియస్‌లు పెరగనున్నట్టు ఐఎండీ అంచనా వేసింది. ఉదయం పూట పొగ మంచు ఉన్నా.. మధ్యాహ్నం కల్లా అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని వెల్లడించింది. అంతేకాదు, తెలంగాణలో ఇప్పటికే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ చేశామని వివరించింది.

తెలంగాణలో మార్చి నాటికే కొన్ని చోట్ల 41 డిగ్రీల సెల్సియస్‌ల ఎండలు రికార్డు అయ్యాయి. దీంతో ఇక వచ్చే నెల, ఆ తర్వాతి మే నెలలో ఎండలు ఎలా ఉంటాయా? అనే టెన్షన్ సాధారణంగానే ప్రజల్లో నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios