Asianet News TeluguAsianet News Telugu

కాళేశ్వరం ప్రాజెక్ట్ విస్తరణ పనులు: తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు


కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనుల విషయమై భూ నిర్వాసితులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు చేపట్టనుంది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై 27న విచారణ చేయనుంది. 

Supreme Court Issues notice To Telangana Government
Author
Karimnagar, First Published Jul 22, 2022, 5:15 PM IST

హైదరాబాద్: kaleshwaram project విస్తరణ పనుల విషయమై భూ నిర్వాసితులు  శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో పిటిసన్ దాకలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు Supreme Court స్వీకరించింది. ఈ విషయమై Telangana ప్రభుత్వానికి, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ  పిటిషన్ పై విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 

కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్ 21న సీఎం KCR జాతికి అంకితం చేశారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్ ను మార్చారు.  ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం అని పేరు పెట్టారు.  ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో రిజర్వాయర్ల  నిర్మాణం భూములు ఇచ్చేందుకు కొన్ని గ్రామాల ప్రజలు గతంలో ఆందోళనలు నిర్వహించారు. అయితే వీరికి పలు పార్టీలు కూడా మద్దతును ప్రకటించాయి. ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించి రిజర్వాయర్ల నిర్మాణాలను కూడా ప్రభుత్వం చేపట్టింది. 

also read:కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: తేల్చేసిన కేంద్రం

అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరిస్తే తమ భూములు ముంపునకు గురౌతాయని కొందరు రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ విషయమై పార్లమెంట్ లో కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ఈ విషయమై లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది.  కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ విషయమై కేంద్రం నుండి నిన్ననే ప్రకటన ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios