Asianet News TeluguAsianet News Telugu

లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్ రెడ్డి జంప్ - కేటీఆర్

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 కంటే ఎక్కువ సీట్లు గెలవబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. అందుకే ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి బీజేపీకి వెళ్తారని ఆరోపించారు.

Revanth Reddy to join BJP after Lok Sabha polls: KTR..ISR
Author
First Published Mar 26, 2024, 5:28 PM IST

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరేందుకు రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం చేసిన ఆరోపణలకు భిన్నంగా, రేవంత్ రెడ్డి మోడీని తన 'బడే భాయ్' (అన్నయ్య) గా అని సంభోదిస్తున్నారని, 'గుజరాత్' నమూనాను ప్రశంసిస్తున్నారని కేటీఆర్ అన్నారని ‘తెలంగాణ టుడే’ నివేదించింది.

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పార్టీలో వస్తే స్వాగతిస్తాం - కాంగ్రెస్..

బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతల తెలంగాణ భవన్ లో మంగళవారం కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత బీజేపీలోకి ఫిరాయించే తొలి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అని, దీని కోసం ఆయన ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారని చెప్పారు.

ఇసుక తవ్వకాల కుంభకోణాలు, రైస్ మిల్లర్లు, రియల్టర్లు, ఇతర వ్యాపారవేత్తలను బ్లాక్ చేయడం వంటిపై నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం బీఆర్ఎస్ పాలనలో కుంభకోణాలు జరిగాయంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. అధికార పార్టీకి ముడుపులు చెల్లించకపోవడం వల్లే గత మూడు నెలలుగా ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు.

ఇది మనీలాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు - కల్వకుంట్ల కవిత..

‘‘ఎన్నికల ఖర్చుల కోసం సీఎం.. ఢిల్లీలోని పార్టీ అధిష్టానానికి రూ.2,500 కోట్ల నిధిని పంపారు. దురదృష్టవశాత్తూ పిక్ పాకెట్ లా మాట్లాడే ముఖ్యమంత్రి మనకు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడంలో విఫలమరు. మెరుగైన విద్యుత్, నీటి సరఫరా, రైతులకు రైతుబంధు సాయం, సామాజిక భద్రత పింఛన్ల పెంపు తదితర అంశాలపై దృష్టి పెట్టకుండా ఫోన్ ట్యాపింగ్, ఇతర అసత్య ప్రచారాల ముసుగులో ముఖ్యమంత్రి తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నారు’’ అని కేటీఆర్ ఆరోపించారు.దేశంలో కాంగ్రెస్ 40 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ గెలిచే అవకాశం కూడా లేదని కేటీఆర్ అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉందని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios