Asianet News TeluguAsianet News Telugu

శేఖర రావు సస్పెన్షన్: హుజూర్ నగర్‌లో ప్రజా పార్టీకి సిపిఎం మద్దతు

సీపీఎం నుండి  పారేపల్లి శేఖర్ రావును సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సీపీఎం రాస్ట్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకొంది.

parepalli shekhar rao suspension from cpm for negligence
Author
Hyderabad, First Published Oct 7, 2019, 1:04 PM IST

హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో  తెలంగాణ ప్రజా పార్టీకి సీపీఎం మద్దతును ప్రకటించింది.  ఈ స్థానంలో సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ ‌ తిరస్కరించడంతో  తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థి సాంబశివగౌడ్ కు సీపీఎం మద్దతు ఇచ్చింది.

ఈ నెల 21న హుజూర్‌నగర్ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానానికి సీపీఎం అభ్యర్ధిగా పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ పత్రాల్లో  సరైన పత్రాలు దాఖలు చేయని కారణంగా సీపీఎం అభ్యర్ధి శేఖర్ రావు నామినేషన్ ను  రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.

తమకు ఈ ఎన్నికల్లో  మద్దతు ఇవ్వాలని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ఇటీవల కోరారు. అయితే ఆదివారం నాడు సీపీఎం రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయమై చర్చించారు.

రాష్ట్ర కార్యవర్గ నిర్ణయాన్ని పార్టీ కేంద్రకమిటీకి నివేదించారు.కేంద్ర కమిటీ సూచన మేరకు హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో బరిలో ఉన్న తెలంగాణ ప్రజా పార్టీకి మద్దతివ్వాలని సీపీఎం నిర్ణయం తీసుకొంది. 

మరో వైపు ఈ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో  పారేపల్లి శేఖర్ రావును  సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. అంతేకాదు సీపీఎం జిల్లా కమిటీ బాధ్యతల నుండి సూర్యాపేట జిల్లా కార్యదర్శి రాములు నుండి  తప్పించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios