Asianet News TeluguAsianet News Telugu

మల్లు రవి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Mallu Ravi Biography: మల్లు రవి కాంగ్రెస్ లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు రేవంత్ రెడ్డి హయాంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి మల్లు రవి మరోసారి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం.. 

Mallu Ravi Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ
Author
First Published Mar 28, 2024, 10:01 AM IST

Mallu Ravi Biography: మల్లు రవి కాంగ్రెస్ లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు రేవంత్ రెడ్డి హయాంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి మల్లు రవి మరోసారి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం.. 

బాల్యం, విద్యాభ్యాసం

డాక్టర్ మల్లు రవి  1950 జూలై 14న ఖమ్మం జిల్లాలోని  లక్ష్మీపురం గ్రామం లో జన్మించారు. ఆయన తండ్రి పేరు అఖిల్లాండ, ఆయన హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో ఎం.బి.బి.ఎస్. డి.ఎల్.ఓ. విద్యను అభ్యసించారు. మల్లు రవికి  మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు కుమార్తె అయిన డాక్టర్ రాజపన్సి దేవితో 1982 జూన్ 5 న  వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు మల్లు సిద్ధార్ధ, ఒక కుమార్తె ఉన్నారు.
  
రాజకీయ జీవితం

మల్లు రవి కాంగ్రెస్ లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు రేవంత్ రెడ్డి హయాంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మల్లు రవి 1980లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ డాక్టర్స్ వింగ్ కన్వీనర్ గా  పనిచేస్తారు. ఇలా రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన 1991 లో కాంగ్రెస్ తరపున తొలిసారిగా నాగర్ కర్నూల్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ, 1996లో మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1998-1999లో నాగర్ కర్నూల్ ఎంపీగా పనిచేసిన ఆయన 1999లో ఓడిపోయారు.  

అనంతరం 2008లో జడ్చర్ల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఇక  2009, 2014 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన ఆయన ఆ రెండు సార్లు 20,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు.  2019లో మరోసారి నాగర్ కర్నూల్ లోక్ సభ సిగ్మెంట్ కు కాంగ్రెస్ తరపున మరోసారి పోటీ చేసిన మల్లు రవి టిఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు చేతిలో ఓడిపోయారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ మనుగడ కోసం కష్టపడ్డ నాయకుడిగా మల్లు రవికి మంచి గుర్తింపు ఉంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారు. జిల్లాలోనే కాక రాష్ట్రంలోనూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ఎప్పటికప్పుడు తన నిరసనగళాన్ని వినిపించారు. ప్రస్తుతం ఆయన టీపీసీసీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే.. 20 జనవరి 2024న మల్లు రవి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి మల్లు రవి మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక ప్రత్యార్థుల విషయానికి వస్తే..బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఎస్పీ నుంచి ఇవాళ టిఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండగా.. బీజేపీ తరుఫున ఇటీవల టిఆర్ఎస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ కుమార్ పేరును బిజెపి హై కమాండ్ ప్రకటించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios