Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ ఎంపీ స్థానం నుండి గడ్డం శ్రీనివాస్ యాదవ్ బరిలోకి: కేసీఆర్

హైద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని బీఆర్ఎస్ ఇవాళ ప్రకటించింది.

KCR Announces Gaddam Srinivas Yadav Name for Hyderabad Loksabha Segment  lns
Author
First Published Mar 25, 2024, 11:49 AM IST


హైదరాబాద్:పార్లమెంట్ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఫోకస్ పెంచింది.  హైద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి  గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దింపనుంది  బీఆర్ఎస్. ఈ మేరకు సోమవారంనాడు కేసీఆర్  గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు.

 

బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే

1.ఖమ్మం-నామా నాగేశ్వరరావు
2.మహబూబాబాద్-మాలోతు కవిత
3.మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి
4.చేవేళ్ల-కాసాని జ్ఞానేశ్వర్
5.నాగర్ కర్నూల్-ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
6.వరంగల్-కడియం కావ్య
7.నిజామాబాద్- బాజిరెడ్డి గోవర్ధన్
8.మెదక్- వెంకట్రామిరెడ్డి
9.నల్గొండ-కంచర్ల కృష్ణారెడ్డి
10.భువనగిరి-క్యామ మల్లేష్
11.సికింద్రాబాద్-పద్మారావు గౌడ్
12. కరీంనగర్-బోయినపల్లి వినోద్ కుమార్
13.పెద్దపల్లి-కొప్పుల ఈశ్వర్
14.ఆదిలాబాద్-ఆత్రం సక్కు
15.జహీరాబాద్-గాలి అనిల్ కుమార్
16.మల్కాజిగిరి-రాగిడి లక్ష్మారెడ్డి
17.హైదరాబాద్-గడ్డం శ్రీనివాస్ యాదవ్

2019 పార్లమెంట్ ఎన్నికల్లో  బీఆర్ఎస్ 9 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది.  గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు   జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే  ప్రస్తుతం  తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది.  తెలంగాణలోని  17 ఎంపీ స్థానాల్లో  కనీసం  12 నుండి  14 ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని  కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కూడ  తెలంగాణలో తమ పట్టును కోల్పోలేదని ఎంపీ ఎన్నికల్లో నిరూపించుకోవాలని భావిస్తుంది.  బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు  కొందరు కాంగ్రెస్, బీజేపీలలో చేరారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios