Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఈడీ,ఐటీ సోదాలు: మంత్రి గంగుల, టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి కార్యాలయాల్లో సోదాలు

తెలంగాణ మంత్రి  గంగుల కమలాకర్ ,టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవికి చెందిన కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈడీ సోదాల సమాచారం తెలుసుకున్న మంత్రి గంగుల కమకమలాకర్ దుబాయ్ నుండి కరీనంగర్ కు చేరుకున్నారు.

Enforcement Directorate And Income Tax Joint Raid in Gangula Kamalakar and TRS MP Gayatri Ravi firms
Author
First Published Nov 10, 2022, 9:57 AM IST

హైదరాబాద్:తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఇతర గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో,కార్యాలయాల్లో రెండో రోజూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి నివాసంలో  గురువారంనాడు సోదాలు చేపట్టారు. హైద్రాబాద్‌లోని శ్రీనగర్ కాలనీతో పాటు  హైద్రాబాద్ కరీంనగర్ లలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

మంత్రి గంగుల కమలాకర్ కుటుంబం చాలా ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారంలో ఉంది. గాయత్రి రవి కూడా ఇదే వ్యాపారంలో ఉన్నారు.గాయత్రి రవికి టీఆర్ఎస్ ఇటీవలనే రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టింది. ఉమ్మడి ఖమ్మం  జిల్లాలో గాయత్రి రవి గ్రానైట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

గ్రానైట్ వ్యాపారుల అక్రమాలపై గతంలో ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టి  గ్రానైట్ ను ఎగుమతి చేశారని ప్రభుత్వానికి ఫిర్యాదలు అందాయి. అంతేకాదు మైనింగ్ విషయంలో తీసుకున్న లీజు కంటే కూడా ఎక్కవ భాగంలో తవ్వకాలు చేపట్టారనే ఆరోపణలున్నాయి. ఈ  విషయాలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ  ఫిర్యాదులపై గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది.

గతంలో కూడా ఇదే కేసు విషయమై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి గ్రానైట్ వ్యాపారం నిర్వహించారని అందిన ఫిర్యాదుల మేరకు ఈడీ, ఐటీ అధికారులు నిన్నటి నుండి సోదాలు చేస్తున్నారు. హైద్రాబాద్, కరీంనగర్ లలో సోదాలు చేస్తున్నారు. నిన్న ఉదయం నుండి మంత్రి గంగుల కమలాకర్ నివాసంతో పాటు ఆయన సోదరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఈడీ అధికారుల సోదాల సమాచారం తెలుసుకన్న కమలాకర్ దుబాయ్ నుండి కరీంనగర్ కు చేరుకున్నారు. తన ఇంటి తాళం పగులగొట్టి  సోదాలు నిర్వహించుకోవాలని తాను అనుమతిని ఇచ్చినట్టుగా గంగుల కమలాకర్ మీడియాకు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ పోర్టు ద్వారా తరఅించిన గ్రానైట్ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని అందిన ఫిర్యాదుల మేరకు ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 

also read:మంత్రి గంగుల సహా పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో ఈడీ సోదాలు:కరీంనగర్,హైద్రాబాద్‌లలో రైడ్స్

గ్రానైట్ వ్యాపారంలో ఉన్న  టీఆర్ఎస్ కు చెందిన  ఎంపీ గాయత్రి రవి, మంత్రి గంగుల కమలాకర్ నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించడం చర్చకు తావిచ్చింది.మునుగోడు ఉప ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చిన రెండు రోజులకే ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. ఈడీ, ఐటీ సోదాలు కూడా జరిగే  అవకాశం ఉందని గతంలో జరిగిన టీఆర్ఎస్  శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ తమ పార్టీ ప్రజా ప్రతినిధులతో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.


 


 

Follow Us:
Download App:
  • android
  • ios